Sitaa raamula kalyanam in bhadrachalam

sitaa raamula kalyanam in bhadrachalam

sitaa raamula kalyanam in bhadrachalam

1.gif

Posted: 04/01/2012 12:47 PM IST
Sitaa raamula kalyanam in bhadrachalam

             badrachalam-sitaramula-kalyanam_inn_111అనంతకోటి భక్తుల ఆరాధ్యదైవం సీతారాముల కళ్యాణం ఇవాళ దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా జరుగుతోంది.  దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీరామనవమి పర్వదినాన్ని మిథిలా స్టేడియంలో కన్నుల పండువగా సాగుతున్నాయి. ఇవాళ (ఆదివారం) ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ స్వామి వారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరుగింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నమున సీతారాముల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచటంతో భక్తులు ఆనంద సాగరంలో, భక్తి ప్రపత్తులతో తమ ఇష్టదైవాలను కొలుస్తూ పరవశించిపోయారు.
            కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రాద్రి రాములవారికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం జరుగుతున్న మిథిలా మైదానికి చేరుకుని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసి, కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి భద్రాద్రి చేరుకున్న సీఎం ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు సి. రామచంద్రయ్య, బాలరాజు, పొన్నాల లక్ష్మయ్య తదితర ప్రముఖులు శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యారు.

        శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రామునికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ కనుమూరి బాపిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరపున ఆయన సీతారామ దంపతులకు పట్టువస్త్రాలు పట్టుకొచ్చారు కన్నుల పండువగా జరుగుతున్న కల్యాణోత్సవాన్ని వేలాది భక్తజనం ప్రత్యక్షంగా తిలకిస్తూ సీతారాముల ఆశీర్వాదాలు పొందుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  This year onwards sitaramula kalyana celebrations two days
Cbi files chargesheet against jaganarrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles