Chiranjeevi praised ysr and naidu

MLA Chiranjeevi praised late YS Rajasekhar Reddy and TDP chief Nara Chandrababu Naidu.chiranjeevi, ys rajasekhar reddy, chandrababu naidu, assembly, telangana, hyderabad

MLA Chiranjeevi praised late YS Rajasekhar Reddy and TDP chief Nara Chandrababu Naidu.chiranjeevi, ys rajasekhar reddy, chandrababu naidu, assembly, telangana, hyderabad

Chiranjeevi praised YSR and Naidu.GIF

Posted: 03/28/2012 12:39 PM IST
Chiranjeevi praised ysr and naidu

Chiruకాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవి తిరుపతి అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానం నుండి ప్రమోషన్ పొంది రాజ్యసభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యునిగా ద్రువీకరణ పత్రం స్వీకరించిన ముఖ్యమంత్రిని కలిసిన చిరు తరువాత సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మరోసారి ‘అందరివాడు’ లాగా మాట్లాడారు. ముఖ్యంగా ఆయన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయడులనే కాకుండా అందరి నేతల గురించి ప్రస్థావించాడు. శాసనసభలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని.. అసెంబ్లీ తనకొక చక్కటి రాజకీయ పాఠశాలగా ఉపయోగపడిందని వివరించారు. ప్రజలు గెలిపించినందునే తాను అసెంబ్లీలో అడుగుపెట్టానని.. వారి రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని అన్నారు. మాజీ సీఎం వైఎస్.. సమస్యలపై ధైర్యంగా నిర్ణయాలను తీసుకునేవారని, చక్కటి వాగ్ధాటితో మాట్లాడేవారని ప్రశంసించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటికీ అసెంబ్లీకి ముందుగా 'ప్రిపేర్' అయి వస్తారని.. నిత్య విద్యార్థిలా కన్పిస్తారని కొనియాడారు. సీఎం కిరణ్ స్వచ్ఛమైన, పారదర్శక పాలనను అందిస్తున్నారని మెచ్చుకున్నారు. మంత్రులందరూ తనకు బాగా సహకరించారని వారిని అభినందించారు.

ఈ ప్రసంగం విన్న అక్కడి వారు చిరంజీవి సినిమాల్లో ‘అందరివాడు’ లాగ రాజకీయ జీవితంలో కూడా ‘అందరివాడి’గా మాట్లాడారని అనుకున్నారు. ఎంతైనా చిరంజీవి కల్మషం లేని మనిషి అని మరోసారి నిరూపించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Punjab cm probable candidate for vice president
A father ordered his daughter to beg at temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles