Debit cards based on rupay platform launched

banking,public sector banks,company information,new product,money and investing,credit cards and debit cards,RuPay payment platform, debit cards, National Payments Corporation of India, point of sale (POS) terminals, global payment product

State Bank of India, Bank of Baroda, Bank of India, and Union Bank of India on Monday formally launched debit cards based on the indigenously developed RuPay payment platform. .

Debit cards based on RuPay platform launched.GIF

Posted: 03/27/2012 01:52 PM IST
Debit cards based on rupay platform launched

Rupay-Cardతొలిసారిగా పూర్తి దేశీయ పేమెంట్ గేట్‌వే ఆధారిత ‘రూపే’ డెబిట్ కార్డును రిజర్వ్ బ్యాంక్ ఈడీ జి. పద్మనాభన్ ఆవిష్కరించారు. దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీపీఐ) రూపొందించింది. దీనికి కావాల్సిన టెక్నాలజీని ఎలక్ట్రానిక్ పేమెంట్ సర్వీసుల సంస్థ యూరోనెట్ అందిస్తుంది. ఈ దేశీ డెబిట్ కార్డు క్రమంగా మాస్టర్‌కార్డు, వీసాకార్డుల స్థానంలో చలామణీలోకి వస్తుందని పద్మనాభన్ చెప్పారు. విస్తృతంగా ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్ పేమెంట్ వ్యవస్థలకి.. రూపే పేమెంట్ గేట్‌వే ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కార్డుల ద్వారా జరిగే చెల్లింపు లావాదేవీలకు దేశీయ బ్యాంకులు ప్రస్తుతం విదేశీ నెట్‌వర్క్‌లైన వీసా, మాస్టర్‌కార్డుల గేట్‌వేలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అ

యితే, వీటి నిబంధనలను అందుకోలేని పలు బ్యాంకులు కార్డులను జారీ చేయడానికి సాధ్యపడటం లేదు. పైగా విదేశీ నెట్‌వర్క్‌లపై లావాదేవీల వ్యయం కూడా బ్యాంకులకు అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే దేశీయ నెట్‌వర్క్‌ను రూపొందించుకుంటే తమ ఖర్చులు కూడా తగ్గుతాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ భావించింది. తదనుగుణంగానే ఆర్‌బీఐ అనుమతితో ఎన్‌పీసీఐ ఇందుకు అవసరమైన ‘రూపే’ నెట్‌వర్క్‌ను రూపొందించింది. బ్యాంకులకు లావాదేవీల ఖర్చులను తగ్గించడంతో పాటు దేశంలో జరిగే చెల్లింపుల వివరాలు విదేశాలకు బహిర్గతం కాకుండానూ ఉపయోగపడుతుంది. రూపీ, పేమెంట్ అనే పదాలకు సంక్షిప్త రూపమే ‘రూపే’. ఎన్‌పీసీఐ త్వరలోనే రూపే ఏటీఎంలు, ప్రీపెయిడ్ కార్డులు, క్రెడిట్ కార్డులనూ ప్రవేశపెట్టనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Popcorn is healthier than fruits
Obama greets manmohan with hug at seoul meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles