Army chief general vk singhs claim rocks parliament

Army Chief General VK Singh's claim rocks Parliament,General VK Singh has said is a serious matter

Army Chief General VK Singh's claim rocks Parliament

Parliament.gif

Posted: 03/27/2012 10:41 AM IST
Army chief general vk singhs claim rocks parliament

Army Chief General VK Singh's claim rocks Parliament

సైనిక వాహనాల కొనుగోలుకు అనుమతిస్తే 14 కోట్ల రూపాయల లంచం ఇవ్వటానికి ఒక సరఫరాదారు తనకు ఆఫర్ ఇచ్చాడంటూ సైనిక దళ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ వికె సింగ్ ఒక ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూ విషయం రాజ్యసభను కుదిపివేసింది. రక్షణ మంత్రి ఆంటోనీ సభకు వచ్చి నిజానిజాలు ప్రకటించాలంటూ ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని అడ్డుకున్నాయి. చైర్మన్ అన్సారీ చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కావటంతో సభ పనె్నండు గంటల వరకూ వాయిదా పడింది. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన తరువాత జనరల్ సింగ్ చేసిన సంచలనాత్మక ప్రకటనపై సీబీఐ విచారణకు ఆదేశించినట్టు రక్షణ మంత్రి అంటోనీ చేసిన ప్రకటనపై తిరిగి ప్రతిపక్షాలు అభ్యంతరం తెలియచేశాయి.

మంత్రి సభకు వచ్చి ప్రకటన చేయకుండా టీవీ చానల్స్ ప్రకటనలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం లేవదీశాయి. ప్రతిపక్షాలు తమ పట్టువీడక పోవటంతో డిప్యూటీ చైర్మన్ రెహమాన్ ఖాన్ మధ్యాహ్నం రెండు వరకు సభను వాయిదా వేశారు. పుట్టిన తేదీ విషయంలో వివాదంలో చిక్కుకున్న జనరల్ సింగ్, ఒక ఆంగ్ల దిన పత్రికుకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో తనకు 14కోట్ల రూపాయల లంచం ఇవ్వటానికి ఒక ఆయుధాల సరఫరాదారు ముందుకొచ్చాడని చెప్పారు. ఈ విషయాన్ని తాను వెంటనే రక్షణ మంత్రి ఆంటోనీ దృష్టికి తీసుకెళ్లానని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యవహారంలో పదవీ విరమణ చేసిన ఒక ఉన్నతాధికారి ప్రధాన పాత్రధారి అని ఆయన ఆరోపించారు. తనకు ముందు పని చేసిన వారికి కూడా ముడుపులు ముట్టాయని, అంతేకాక మన సైనిక అవసరాలకు ఏమాత్రం పనికిరాని ఒక కంపెనీకి చెందిన వాహానాలను కోట్లాది రూపాయలు ఖర్చుచేసి కొన్నారని ఆయన చెప్పారు.

అవినీతిపై కొరడా ఝళిపించినందుకే తనపై కొంతమంది కుట్ర చేసి పుట్టిన తేదీపై వివాదం లేవదీశారని జనరల్ సింగ్ తెలియచేశారు. సైనిక దళ సిబ్బంది ప్రధానాధికారి చేసిన ఈ ఆరోపణల తీవ్రతను గుర్తించి ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రక్షణ మంత్రి ఇప్పటి వరకూ ఏం చర్యలు తీసుకున్నారు? లంచం ఇవ్వచూపిన వారిని వెంటనే మిలట్రీ పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ప్రభుత్వం తరపున ఒక్క మంత్రి కూడా జవాబు ఇవ్వటానికి ముందుకు రాకపోవటంతో సభను వాయిదా వేయక తప్పలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man accused of beating dog to death
Ram charan teja birthday 2012 celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles