Ram charan teja birthday 2012 celebrations

Ram Charan Teja Birthday 2012 Celebrations, Ram Charan Teja Photo Gallery At Racha Press Meet,Ram Charan Teja Birthday Celebrations 2012 Photos,Ram Charan Teja Birthday, Ram Charan Teja 2012, Ram Charan Teja, Ram Charan Birthday 2012, Ram Charan Birthday Celebrations 2012

Ram Charan Teja Birthday 2012 Celebrations

Ram Charan.gif

Posted: 03/27/2012 10:30 AM IST
Ram charan teja birthday 2012 celebrations

Ram-Charan-Teja-At-Racha-Press-Meet_

రామ్‌చరణ్‌ తన పుట్టినరోజును అన్నపూర్ణ స్టూడియోలో జరుపుకున్నారు. రచ్చ షూటింగ్‌లో నిర్మాత పెద్ద కేక్‌ను తెప్పించారు. దాన్ని ఆయన కట్‌ చేశారు. మంగళవారం పుట్టిన రోజు అయిన ప్పటికీ ఆరోజు షూటింగ్‌ కోసం పొల్లాచ్చి వెళ్లనుండ డంతో అభిమానుల కోసం సోమవారం ఈ వేడుకను చేస్తున్నామని నిర్మాత ప్రసాద్‌ తెలిపారు. మెగాసూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆర్‌.బి. చౌదరి సమర్పకులు, సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. ఎస్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ నెలాఖరుతో షూటింగ్‌ పూర్తవుతుంది. ఇప్పటికే ఆడియోకు మంచి స్పందన లభించింది. సినిమాను ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నామన్నారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ నేను చేస్తున్న ఈ చిత్రం డిఫరెంట్‌తో కూడిన వాణిజ్య విలువలున్న సినిమా ఇది. సిటీ నేపథ్యంలో కథ సాగుతుంది. దర్శకుడు చెప్పిన కథ నచ్చింద న్నారు.

బుద్ధుని విగ్రహం దగ్గర 'వాన వానా...' పాట తీయడంలో మహిళాసంఘాలు చేస్తున్న రచ్చపై స్పందిస్తూ... అందులో అసభ్యత లేదనీ అన్నారు. డాన్స్‌ చేస్తుండగా గాయాలయ్యాయనీ, అయినా సినిమా అనుకున్నట్లు రావాలని..పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని నటిస్తున్నాని అన్నారు. ఈ చిత్రంలో సినిమాటోగ్రాఫర్‌ సమీర్‌ చాలా అందంగా చూపించారని అన్నారు. తమన్నా మాట్లాడుతూ ఈ సినిమా చేస్తున్నంతసేపూ చాలా ఎంజాయ్  చేస్తూ నటించాను. రామ్‌చరణ్‌తో నటించడం చాలా పాజిటివ్‌ వైబ్రేషన్‌గా ఉంది. అతను చేస్తున్న డాన్స్‌ చూసి నేను నేర్చుకున్నాను. దర్శకుడు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. రేపు పొల్లాచ్చిలో తీయబోయే సాంగ్‌ ఫోక్‌ సాంగ్‌. జీవితంపై అవగాహన పాత్ర, బాగా ఉన్నత కుటుంబానికి చెందిన దానిగా నటిస్తున్నాని అన్నారు.

దర్శకుడు సంపత్‌ నంది మాట్లాడుతూ మణిశర్మ ఆడియోకు మంచి స్పందన వచ్చింది. చిన్నిచరణ్‌, చంద్రబోస్‌ చక్కటి సాహి త్యాన్ని అందించారు. 'తిల్లా తిల్లా తెల్లకోడిపిల్ల...' అనే పాట చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. 'రచ్చ' అంటే ఆనందంతో సెలబ్రేట్‌ చేసుకునేది అని ఈ చిత్రంలోని అర్థం. చిత్ర కథ కూడా అలాగే ఉంటుంది. హీరో ఎప్పుడూ అన్నింటిలో ముందుండాలనుకునే వ్యక్తి. అందరినీ ఎలా రచ్చ చేస్తాడనేదే పాయింట్‌. అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Army chief general vk singhs claim rocks parliament
Anna hazare storms delhi warns of august stir  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles