5gif

5.gif

Posted: 03/24/2012 12:53 PM IST
5gif

          INDIమా ఉద్యోగాలు దోచుకుంటున్నారు మొర్రో అంటూ గగ్గోలు పెట్టిన అమెరికాకు చెంపపెట్టు లాంటి వార్త.  అమెరికాలో భారత కంపెనీలు ఊరకే వ్యాపారం చేయడం లేదని, అమెరికాకు కోట్లాది డాలర్ల పన్నులను చెల్లించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నట్టు వెల్లడించింది భారత ఐటి పరిశ్రమల సంఘం నాస్కామ్. గడచిన ఐదేళ్ల కాలంలో భారత ఐటి పరిశ్రమ అమెరికా ఖజానాకు చెల్లించిన పన్నుల మొత్తం 1,500 కోట్ల డాలర్లకు (సుమారు 75,000 కోట్ల రూపాయలు) పైనే ఉందని, ఇదే సమయంలో 2.8 లక్షలకు మించి ఉపాధి అవకాశాలను కల్పించినట్టు నాస్కామ్ స్పష్టంగా లెక్కలు చూపి అమెరికా రాజకీయ వేత్తలకు ధీటైన సమాధానం ఇచ్చింది. Indian_IT_Industry
           ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా గడచిన ఐదేళ్ల కాలంలో తీవ్ర సంక్షోభంతో ఊపిరాడని పరిస్థితిని ఎదుర్కొని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అమెరికాకు ఇదే కాలంలో భారత ఐటి కంపెనీలు 1500 కోట్ల డాలర్ల పన్నులను చెల్లించి ఒక విధంగా అమెరికాకు  చేదోడుగా నిలిచాయని పేర్కొంది.  ఆర్థిక సంక్షోభం వల్ల అమెరికాలో ఎన్నో కంపెనీలు మూతబడిన తరుణంలో 128 కొనుగోళ్లను చేపట్టిన భారత కంపెనీలు 500 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. వేలాది మంది ఉద్యోగులు రోడ్డు పాలు కాకుండా కాపాడాయని నివేదిక పేర్కొంది.
          ఐదేళ్ల క్రితం భారత కంపెనీల వల్ల ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 1,07,000గా ఉండేది. ఇప్పుడది 2,80,000 దాటింది. వచ్చే రెండేళ్ల కాలంలో ఉద్యోగ అవకాశాలు నాలుగు రెట్లు పెరిగే ఆస్కారం ఉందని నాస్కామ్ స్పష్టం చేసింది

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway reservation services distrubed in vizag
Petro price may be increased in a few days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles