Telangana by year end women cm to lead

Telangana By Year End Women Cm To Lead, telangana KCR TRS kavitha Telangana Bhavan Women CM Year end Ugadi pooja

Telangana By Year End Women Cm To Lead

Telangana.gif

Posted: 03/23/2012 06:18 PM IST
Telangana by year end women cm to lead

Telangana By Year End Women Cm To Lead

అలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న  సామెత మాదిరిగా  ఇప్పటివరకు  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఊసే లేదు. అంతలోనే  తొలి ముఖ్యమంత్రి  మహిళ ఏంటని  అనుకుంటున్నారా?  ఇది పచ్చి నిజం  కాబోతుందని  ప్రముఖ జ్యోతిష్య పండితుడు దామోదర శర్మ  అంటున్నారు. ఈ ఏడాది  ఆకరు కల్లా  తెలంగాణ  రాష్ట్రం  ఏర్పడుతుందని,  తొలి ముఖ్యమంత్రి  మహిళ పగ్గాలు  చేపడుతుందని  ఆయన జోస్యం  చెబుతున్నారు.   ఉగాది  సందర్భంగా  హైదరాబాదులోని  తెరాస పార్టీ ప్రధాన కార్యాలయం  తెలంగాణ భవన్ లో  టీఆర్ఎస్ మహిళ విభాగం   ఆధ్వర్యంలో  పంచాంగ  శ్రవణ  కార్యక్రమం  నిర్వహించబడంది.  ఈ ఏడాది  గ్రహ  స్థితి  తెరాస చీఫ్  కేసిఆర్   మనోవాంఛ నెరవేరుతుందని  చెప్పారు.   అంతేకాకుండా రాష్ట్రంలో పాడి పరిశ్రమలు  అభివ్రుద్ది  చెందుతాయని  తెలిపారు. ఈ వేడుకల్లో  తెలంగాణ  రాష్ట్ర సమితి  మహిళా విభాగం నేతలు పాల్గాన్నారు.  ఉగాది పచ్చడి  అందరికీ  పంచారు.  అయితే  ప్రస్తుతానికి  తెలంగాణ నేతలంతా  ఎవరి దారిలో వారు నడుస్తున్నప్పటికీ , త్వరలోనే  వారంతా  ఒకే తాటిపైకి  వస్తారని, అంతిమ లక్ష్యం దిశగా కలిసికట్టుగా  పనిచేస్తారని  శర్మ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghuveera reddys silent deeksha
Peddapalli mp g vivekananda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles