Ugadi festival 2012

Ugadi Festival 2012

Ugadi Festival 2012

Ugadi.gif

Posted: 03/23/2012 01:11 PM IST
Ugadi festival 2012

Ugadi Festival 2012

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.ఈ పండగను మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్‌ గానూ జరుపుకుంటారు.

ఉగాది ప్రాముఖ్యం

Ugadi Festival 2012చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టి ఆరంభించాడని నమ్ము తారు. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ’ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొద లవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుం టారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ’ఆది’ ‘ఉగాది’. అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. ’యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్స రాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహరితమైంది.

సంప్రదాయాలు

ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాదిరోజు

Ugadi Festival 20121. తైలాభ్యంగనం
2. నూతన సంవత్సరాది స్తోత్రం
3. నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
5. పంచాంగ శ్రవణం

మొదలైన ’పంచ కృత్య నిర్వహణ’ చేయాలని వ్రతగంధ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ లేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు.

ఉగాది ప్రసాదం

Ugadi Festival 2012ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసా దంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసు కుంటాయి.ఉగాదితో వేసవి ఆంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవ డానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది. అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుంది. కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఇందులో ఉంది. ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది.

కవి సమ్మేళనాలు, అష్టావధానాలు

ఉగాది అంటే గుర్తుకొచ్చేది కవి సమ్మేళనమే. కొన్నేళ్ళ క్రితం రేడియోలో ప్రసారమయ్యే కవి సమ్మేళనాలు ఎంతో ప్రాచుర్యం పొందేవి. ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రపడిన అభ్యుదయ కవు లు సైతం తమ భావాలను ఏదో విధంగా ముసు గేసి అయినా ప్రజల్లో కి తీసుకెళ్ళవచ్చన్న ఉద్దేశం తో ఈ రేడియో కవి సమ్మేళనాలకు హాజరయ్యే వారని చెబుతారు. కవిత్వంలో పీఠాల స్థాపన మొదలైన తరువాత కవిసమ్మేళనాలకు విలువ తగ్గిపోయింది. కవుల సంఖ్య పెరిగిపోయి, కవిత్వం పలుచన కావడం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఉగాది రోజున అష్టావధానం నిర్వహించడం ఆన వాయితీగా వచ్చేది. కాలక్రమంలో ఇదీ ప్రాధాన్యం కోల్పో యింది. అవధానం చేసే వారు తమ ధారణ కంటే కూడా కార్యక్రమానికి వచ్చే ప్రముఖులకు ఆహ్వా నం, వీడ్కోలు పలకడంపైనే అధికంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా గాకుండా అవధా నాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తే అంతరించి పోతున్న ఓ కళారూపాన్ని కాపాడుకున్న వారమవుతాము.

పంచాంగ శ్రవణం

Panchangam-ఒకప్పుడు పంచాంగ శ్రవణం ఊరుమ్మడిగా ఏదైనా ఆలయంలో జరిగేది. ఇప్పుడు అలా గాకుండా ఎవరికి వారు విడివిడిగా తమ వర్గం వారితో కలసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫలితంగా విభిన్న భాష్యాలు వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా రాజకీయా పార్టీల ఆధ్వర్యంలో జరిగే వాటి గురించి చెప్పనక్కర్లేదు. వాస్తవ జ్యోతి షాన్ని పక్కనబెట్టేసి నాయకుడి భజన చేసిన సంద ర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇలాంటివన్నీ ఆచారవ్యవహారాలపై నమ్మకాలను సడలింప జేసేలా ఉంటు న్నాయి. ఇలాంటివాటిని ప్రోత్సహిం కుండా, వర్గాలకు, రాజకీయాలాకు అతీతంగా ఈ వేడుకలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పంచాంగాలు అందరికీ అందు బాటులో ఉండేవి కావు. పండితుల వద్ద మాత్రమే ఉండేవి. అందుకే ఉగాది రోజున జరిగే పంచాంగ శ్రవణానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవ ణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి,వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసి నంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతు న్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది.

వివిధ ప్రాంతాల్లో ఉగాది వేడుకలు

ugadi festival panchangam

గుడి పడ్వా

తెలుగువారిలానే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలకు కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారి సంవత్సరాదిని ’గుడి పడ్వా’గా(పడ్వా అంటే పాడ్యమి) వ్యవహరిస్తారు. మన ఉగాదిపచ్చడి లాంటిదే తయారుచేసి దానికి అదనంగా వాము చేర్చి ఆరగిస్తారు. బ్రహ్మదేవుడు ఆ రోజున సృష్టి ఆరంభించినందుకు గుర్తుగా ఆయన పేరున బ్రహ్మధ్వజం నిలుపుతారు. వెదురుపుల్లకు పట్టువస్త్రం కప్పి, పూలతో అలంకరించి పైన వెండి లేదా కంచు పాత్రలు బోర్లిస్తారు. గుడి పడ్వా రోజు ఈ బ్రహ్మధ్వజాలను తప్పనిసరిగా ప్రతిష్ఠిస్తారు.

పుత్తాండు

తమిళుల ఉగాదిని (తమిళ) పుత్తాండు అంటారు. ఒకప్పుడు తమిళుల ఉగాది కూడా తెలుగు వారిలానే ఏప్రిల్‌లో వచ్చేది. డీఎంకే ప్రభుత్వం దీన్ని ఆర్యుల పండుగగా భావించి జనవరిలో జరిగే సంక్రాంతి సమ యంలోనే ఉగాదివేడుకలు కూడా జరుపుకోవాలని అసెంబ్లీలో చట్టం చేసింది. ఏప్రిల్‌లో వచ్చే ఉగాదిరోజును చిత్తిరై తిరునాళ్‌ (చైత్ర తిరు నాళ్లు)గా జరుపుకోవాలని ప్రకటించింది. ఆ చట్టం ప్రకారం ప్రస్తుతం తమిళుల ఉగాది వారి పంచాంగం ప్రకారం తై మాసం(జనవరి)లో వస్తుంది. సంప్రదాయబద్ధంగా వచ్చే పుత్తాండు నాడు తమిళులు ప్రత్యేకంగా ఆచరించే విధులేవీ లేవు. ఆరోజున ప్రత్యేక పూజలు చేస్తారు. నవకాయపిండివంటలతో విందుభోజనాలు ఆరగిస్తారు. పం చాంగ శ్రవణం మాత్రం తెలుగువారిలాగానే ఉంటుంది. కొన్ని ప్రాం తాల్లో ఎడ్ల పందాలు జరుగుతాయి.

విషు
మలయాళీల సంవత్సరాదిని ‘విషు’గా వ్యవహరిస్తారు. సౌరమానం ప్రకారం చేస్తారు కాబట్టి వీరి ఉగాది ఏప్రిల్‌ మధ్యలోనే వస్తుంది. పం డుగ ముందురోజు రాత్రి ఇంట్లోని మహిళల్లో పెద్దవయస్కురాలు పచ్చి బియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు వన్నెలో ఉండే దోసకాయలు, అరటిపళ్లు, తమలపాకులు, అద్దం... వీటన్నిటినీ ఉరళి అనే పాత్రలో పెట్టి పూజగదిలో దేవుడి దగ్గర ఉంచుతారు. వాటన్నిటినీ ఉంచిన పాత్ర ను విషుకని అంటారు. మర్నాడు ఆమే ముందులేచి వయసుల వారీగా ఇంట్లో అందర్నీ నిద్రలేపి వారి కళ్లు మూసి ఆ పాత్ర దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు కళ్లు తెరవమంటారు. ఆరోజు ఉదయాన్నే లేవగానే మంగళక రమైన ‘విషుకని’ని చూస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్మకం.

వైశాఖీ

సిక్కుల కాలమానం ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి వారి సంవత్సరాది. సౌరమానం ప్రకారం ఇది ఏటా ఏప్రిల్‌ 13న, ముపైశ్ఫఆరు సంవత్సరాలకొకసారి ఏప్రిల్‌ 14నా వస్తుంది. తెలుగువారి సంక్రాంతి లాగా ఇది వారికి పంటల పండుగ. రబీ పంట నూర్పిడి సమయం. సిరు లు పొంగే ఆ సమయంలో సిక్కుల మనసులు ఆనందంతో నిండిపో తాయి. ఆ ఉత్సాహంలో స్ర్తీపురుషులంతా కలిసి భాంగ్రా, గిద్దా నృత్యా లు చేస్తారు. కొత్తగా పండిన గోధుమలను పట్టించి ఆ పిండితో రొట్టెలు చేసి బెల్లం, నెయ్యి కలిపి ఆరగిస్తారు. పెద్దపెద్ద మంటలు వేసి వాటిచు ట్టూ ఆడిపాడతారు.

పొయ్‌లా బైశాఖ్‌

బెంగాలీయుల నూతన సంవత్సరం వైశాఖమాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం చైత్రం ఏడాదిలో చివరిమాసం. వైశాఖశుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు వారు. ఆరోజు ఉదయా న్నే స్ర్తీపురుషులు సంప్రదాయ బెంగాలీ దుస్తులు ధరించి ప్రభాత్‌ఫేరీ పేరి ట నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇంటిముందు రంగు రంగుల ముగ్గులు తీర్చిదిద్దుతారు. వ్యాపారులు ఆ రోజున పాత ఖాతాపుస్తకాలన్నింటినీ మూసేసి సరికొత్త పుస్తకాలు తెరుస్తారు. తమ దుకాణానికి వచ్చిన వినియోగదారులకు మిఠాయిలు పంచుతారు. ఏవై నా బాకీలుంటే ముందురోజే తీర్చేస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆరోజంతా ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తారు. కొత్తవ్యాపారాలు, కొత్తపనులు ప్రారంభిస్తారు.

ఇవీ షడ్రుచులు!

Ugadi Festival 2012తీపి అంటే సుఖానికి, కారం అంటే కష్టానికి, పులుపు దుఃఖానికి, వగరు విచారానికి, చేదు నష్టానికి, ఉప్పు విధేయతకు మారురూపుగా ఈ రుచులన్నీ మేళవించి జీవితంలో కూడా ఇటువంటి ఈతిక బాధలు ప్రతి ఒక్కరికీ ఉంటాయన్న సత్యాన్ని తెలియజేసేందుకు ఉగాది పచ్చడిని ప్రతి సంవత్సరం అందరూ విధిగా తినాలంటారు.

ఉగాది పచ్చడి తినడం వెనక ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వేపపూత పచ్చడిలో సర్వరోగాలను హరింపజేసే లక్షణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ పచ్చడిలో కలిపే ఆరురకాల రుచులకోసం ఒక్కో ఆరోగ్య ఫలాన్ని మిశ్రమంగా చేస్తుంటారు. తీపి కోసం బెల్లం లేదా చెరుకు, పులుపు కోసం చింతపండు రసం లేదా పచ్చిమా మిడి, చేదు కోసం వేపపువ్వు, వగరుకోసం కొంతమంది వేపచిగుళ్లు, లేదా అశోకపత్రం చిగుళ్లను కూడా అందులో కలుపుతారు. వీటికి తగినంత ఉప్పు జతచేసి కొన్ని ప్రాంతాలలో కొబ్బరి, గసగ సాలు, మిరియాలు వంటివి కూడా కలుపుతారు. ఇవన్నీ కలపడం వెనక ఆరోగ్యరహస్యం కూడా ఉంది.

Ugadi Festival 2012

తీపి :మన శరీరంలో వాతాన్ని హరించే గుణం బెల్లం లేదా చెరుకులో ఉంది. సంవత్సరా నికి ఒక్కసారైనా బెల్లం పాకం లేదా బెల్లంతో తయారుచేసిన పిండిపదార్థాలను తినాలని పెద్దలు అంటారు. బెల్లంలో ఉదరరోగాలను హరించే శక్తి ఉంటుంది.

Ugadi Festival 2012

వగరు :వగరు కోసం పచ్చిమామిడికాయలను వాడుతుంటారు. కొత్తగా వచ్చే మామిడి కాయకు ఇంకా టెంకపట్టదు. వగరుగా, పుల్లగా ఉంటుంది. ఈ మామిడిలో జీర్ణశక్తిని పెంపొందించే గుణం ఉంటుంది. కడుపులో జఠరరసాన్ని వృద్ధిచేస్తుంది.

Ugadi Festival 2012

చేదు :చేదు రుచి కోసం కలిపే వేప పువ్వులో శ్లేష్మం, కఫం, వాతం హరించే గుణాలు ఇమిడివున్నాయి. అంతర్లీనంగా క్రిమిసంహారిణిగా, పైత్య నివారిణిగా పనిచేస్తుంది. సంవత్సరంలో ఈ రూపేణా చేదు ఒక్కసారైనా మన దేహంలో చేరి...చర్మ సంబంధిత వ్యధుల నివారణలో దివ్యంగా పనిచేస్తుంది.

Ugadi Festival 2012

పులుపు : పులుపు కోసం కొందరు కొత్త చింతపండు రసాన్ని కలుపుతారు. కొత్త చింత పండు రసంలో వాతం, శ్లేష్మం హరించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.పులుపులో ఉండే విటమిన్‌ సి శరీరంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. పులుపు కోసం ఉపయోగించే పచ్చిమామిడి ముక్కలలో పైత్యం పోగొట్టే గుణం ఉంది.

Ugadi Festival 2012

ఉప్పు : తగిన మోతాదులో తింటే ఉప్పు కూడా దివ్యౌషధమే. రుచికి తగినట్లుగా కలుపుకుంటే ఆహారం కూడా మధురంగా ఉంటుంది. ఆహారం తొందరగా జీర్ణం అయ్యేందుకు, పైత్య నివారణకు ఉప్పును తగిన మోతాదులో వాడతారు. ఇందులో ఉండే సోడియం రక్తంలో తొందరగా కలుస్తుంది. నిస్సత్తువను దూరం చేస్తుంది.

BHAGAVAN-5

కారం : అప్పుడప్పుడు శరీరానికి కారం కూడా కావాలి. కారంలో కంఠరోగాలను హరించే గుణం ఉంది. ఉబ్బు లక్షణాలు, నేత్రరోగాలను దరిచేరనీయదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy
Shankar rao files pil for probe against kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles