Shankar rao files pil for probe against kiran

Shankar Rao files PIL for probe against Kiran,Andhra Pradesh, Kiran Kumar Reddy, Probe, Shankar Rao

Shankar Rao files PIL for probe against Kiran

Shankar.gif

Posted: 03/23/2012 12:50 PM IST
Shankar rao files pil for probe against kiran

Shankar Rao files PIL for probe against Kiran

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి పి. శంకరరావు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) బాంబు పేల్చారు. రాష్ట్రంలో రూ. 500 కోట్ల రూపాయల మేర ఎర్రచందనం కుంభకోణం జరిగిందని, దీనికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు బాధ్యులని ఆరోపిస్తూ వారిని ప్రతివాదులుగా చేరుస్తూ ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ముఖ్య కార్యదర్శి జానకి కొండపి సహా 12 మంది ఈ కుంభకోణానికి బాధ్యులని ఆయన ఆరోపించారు.

ఎర్రచందనం కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఇందులో మూడు కంపెనీలకు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎమ్మార్ కేసు, జగన్ ఆస్తుల కేసులపై విచారణ జరుగుతోందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎర్రచందనం అమ్మకానికి గ్లోబల్ టెండర్లు పిలవాలనే నిబంధనను ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఆయన విమర్శించారు. ఎర్రచందనాన్ని ప్రభుత్వం లోపాయికారిగా అమ్మేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని ఆయన హైకోర్టును కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ugadi festival 2012
Nandi awards presentation today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles