By election poling in a full swing

by election, poling in a, full swing

by election poling in a full swing

1.gif

Posted: 03/18/2012 11:43 AM IST
By election poling in a full swing

           lladie రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఉపఎన్నికల పోలింగ్‌ ఇవాళ (ఆదివారం) జోరుగా సాగుతోంది.  ఉదయం 8.00 గంటల నుండి 7 అసెంబ్లీ స్థానాల్లోనూ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు బారులు తీస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద  ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు తగు భద్రత చర్యలు చేపట్టారు. 
           కాగా, మొదటి రెండు గంటల్లో దాదాపు 10 శాతం పోలింగ్‌ నమోదైంది. మహబూబ్‌ నగర్‌ 19 శాతం, కామారెడ్డి, కొల్లాపూర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 18 శాతం, నాగర్‌ కర్నూలులో 17 శాతం, కోవూరులో 11 శాతం, ఆదిలాబాద్‌లో 9 శాతం పోలింగ్‌ నమోదైంది. 7 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఉపఎన్నికల్లో దాదాపు 13.82 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కామారెడ్డి, కోవూరు నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళల సంఖ్య ఎక్కువ. 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో అత్యధికంగా 14 మంది బరిలో ఉన్నారు. 13 మంది అభ్యర్థులతో మహబూబ్‌నగర్‌ రెండో స్థానంలో ఉంది.elect
           సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సాయంత్రం అయిదు గంటల వరకు లైన్‌లో ఉన్న ఓటర్లకు ఎంత రాత్రైనా ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఓటర్‌ గుర్తింపు కార్డులు లేని వారు, ఎన్నికల సంఘం గుర్తించిన 16 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress president jagan faces tough fight
Karunanidhi threatens to immolate self if anna library is converted to hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles