Ttd senior employee murdered1

Mallikarjun, TTD Senior Assistant, TTD administrative office, Thirupati, Thirumala,

TTD senior assistant has been killed at TTD administrative building.

TTD senior employee murdered.gif

Posted: 03/17/2012 11:22 AM IST
Ttd senior employee murdered1

Tirupati-Devastanamకలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో దారుణం జరిగింది. టీటీడీ పరిపాలన భవనంలో పే అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేసే సీనియర్ ఉద్యోగి మల్లికార్జున్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడు విధులు నిర్వర్తించేదుకు ఆఫీసులో అడుగుపెడుతున్న సమయంలో దుండగల ఒక్కసారిగా అతని పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యతో అక్కడి ఉద్యోగులు భయాందోళలకు గురవుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని హత్య పై దర్యాప్తు చేపట్టారు.

అయితే మల్లికార్జున్ హత్యకు వివాహేతర సంబంధం వల్ల వచ్చిన కుటుంబ కలహాలే కారణమని తెలుస్తుంది. మల్లికార్జున్ భార్య తరుపు బంధువులే ఈ హత్య చేసి ఉంటారని మల్లికార్జున్ తరుపు బంధువులు అంటున్నారు. ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దీని పూర్తి సమచారం తెలియాల్సి ఉంది. టీటీడీ పరిపాలన భవనంలో ఇలాంటి సంటటన జరగటం ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police searches in nagam janardhan house
Rajya sabha candidates final list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles