Rajya sabha candidates final list

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Rajya Sabha Candidates final list.gif

Posted: 03/17/2012 10:44 AM IST
Rajya sabha candidates final list

కాంగ్రెస్‌, టీడీపీల్లో రాజ్యసభ కసరత్తు చివరి అంకానికి చేరింది. కాంగ్రెస్‌ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఇద్దరు పెద్దల సభకు వెళ్ళే ఛాన్సుండటంతో అభ్యర్ధుల పేర్లను పరిశీలిస్తున్నాయ్‌. హస్తం పార్టీ నుంచి ఇప్పటికే చిరంజీవి, రషీద్‌ అల్వీ పేర్లు ఫైనల్‌ అయ్యాయి. టీడీపీలో ఆశావాహుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది.
రాజ్యసభ ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి ఉన్న ఆరు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

తమకున్న నాలుగు స్థానాలకు క్యాండేట్లను ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు కత్తిమీద సాములానే మారింది. పీఆర్పీని విలీనం చేసినందుకు ప్రతిఫలంగా చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అటు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కోటాలో రషీద్‌ అల్వీ, షకీల్‌ అహ్మద్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే వీరిద్దరిలో రషీద్‌ అల్వీ పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు స్థానాలకు పోటీ తీవ్రంగా ఉంది.

ఈ సారి రాష్ట్ర పరిణామాలనే కాకుండా జాతీయ సమీకరణాలను కూడా దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్న అధిష్టానం.. ఆచితూచి అడుగులు వేస్తోంది. దీనికోసం ఢిల్లీలోనే ఉన్న సీఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్సతో హైకమాండ్‌ విస్తృత మంతనాలు జరిపింది. తెలంగాణ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే కేకే కు మరో అవకాశం దక్కుతుందని భావిస్తుండగా.. మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి కోసం సీఎం కిరణ్‌ గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక అధినేత్రి సోనియాతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా రేణుకా చౌదరికి కూడా అవకాశం ఉందని సమాచారం. అటు.. INTUC నేత సంజీవరెడ్డి, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు TDPలో రాజ్యసభ సీట్ల వ్యవహారం కూడా కొలిక్కి వస్తోంది. సీమాంధ్ర నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు సీఎం రమేష్‌ పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.

అటు తెలంగాణ నుంచి మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, బక్క నర్సింహులు, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ పదవి ఆశిస్తున్నారు. వీరిలో... పార్టీలో నెంబర్‌ టూగా ఉన్న దేవేందర్‌గౌడ్‌ కే ఈ ఛాన్స్‌ దక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థిత్వాలకు ఇంకా ఎవరి పేర్లు ఖరారు కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ttd senior employee murdered1
Maoist leader azads encounter was genuine sc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles