Railway minister dinesh trivedi

Railway Minister Dinesh Trivedi, Railway Ticket, three rupees, five rupees, Mahalakshmi, Money,

Railway Minister Dinesh Trivedi

Railway.gif

Posted: 03/15/2012 03:09 PM IST
Railway minister dinesh trivedi

 Railway Minister Dinesh Trivedi

రైల్వేను ఇలా వదిలేయడమా? లేక... ప్రయాణికులపై కాస్త భారం మోపైనా, తన పదవి పోయినా బండిని భద్రంగా పరుగులు తీయించడమా? ఇవి.. రైల్వే మంత్రి దినేశ్ త్రివేదీ తనకు తాను వేసుకున్న ప్రశ్నలు! ఆయన రెండో మార్గాన్నే ఎంచుకున్నారు! భయపడితే అడుగు ముందుకు పడదనుకున్నారు. 'ఎక్కడైతే మనసు స్వేచ్ఛగా ఆలోచిస్తుందో... ఎక్కడైతే సగర్వంగా తలెత్తుకుని తిరుగుతామో...' అనే విశ్వకవి రవీంద్రుడి సందేశాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.

చిల్లర శ్రీమహాలక్ష్మి అంటారు. రైలు టికె ట్లు తీసుకునేటప్పుడు చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య చిల్లరతోనే. టికెట్ ధర 153 రూపాయలు అయ్యిందనుకోండి.. మీరు రెండు వంద నోట్లు ఇస్తే.. కౌంటర్‌లో ఏడు రూపాయల చిల్లర ఉండదు. ఆ ఏడు మీరిస్తే పది ఇస్తామంటారు. లేదంటే వదులుకోవాలి, లేదా కౌంటర్ పక్కనే ఆ చిల్లర వచ్చేవరకు వేచిచూడాలి.

ఈ సమస్యను అధిగమించడానికి త్రివేదీ ఓ మంత్రం కనిపెట్టారు. దగ్గరలోని ఐదు రూపాయలకు మొత్తం ధరను సరిచేస్తారు. అర్థం కాలేదా? 11 లేదా 12 రూపాయలు ఉంటే.. అది 10 రూపాయలు అవుతుంది. అదే 3, 4 రూపాయలు ఉంటే అది 5 రూపాయలు అవుతుంది. దీనివల్ల ఎటూ ప్లాట్‌ఫాం టికెట్ ధర కూడా 5 రూపాయలు అయినందున.. చిల్లర సమస్య చాలావరకు తీరుతుందనేది త్రివేదీ మంత్రం. అయితే సబర్బన్ రైళ్లకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారండోయ్!

మన రైలు పరుగులు తీయాలి! ప్రయాణికులు భద్రంగా గమ్యం చేరాలి. అలా... చేరాలంటే పట్టాలు, వంతెనలు పటిష్ఠంగా ఉండాలి. అందుకు... డబ్బులు కావాలి! డబ్బులు కావాలంటే... చార్జీలు పెంచాలి!''... అని సూటిగా, సుత్తిలేకుండా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Appraiser caught stealing from ttd treasury
House arres  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles