Sc issued notice to 6 ap ministers

Y.S. Jaganmohan Reddy,Supreme Court,Sudhakar Reddy,Illegal Assets,CBI,Andhra Pradesh ministers

SC issued notice to 6 AP ministers and 11 bureaucrats for their alleged role in issuing orders during the tenure of late CM Y.S. Rajashekara Reddy.

SC issued notice to 6 AP ministers.GIF

Posted: 03/12/2012 06:23 PM IST
Sc issued notice to 6 ap ministers

Ministersరాష్ట్ర ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. జగన్‌ ఆస్తుల కేసులో 26 జీవోలపై వివరణ ఇవ్వాలంటూ అటు మంత్రలు, ఇటు ఐఎఎస్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ జరుగుతుండగా కోర్టు ఆదేశాలివ్వడంతో అసెంబ్లీలో పెద్ద దుమారం చెలరేగింది. కళంకిత మంత్రులు రాజీనామా చేయాలంటూ టీడీపీ పట్టుపట్టింది.

ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్ట్‌ షాక్‌ ఇచ్చింది. జగన్‌ ఆస్తుల కేసుకు సంబంధం ఉన్న 26 వివాదాస్పద జీవోల విషయంలో మంత్రులు, ఐఎఎస్‌లకు నోటీసులు జారీ చేసింది.

నెల్లూరుకు చెందిన అడ్వకేట్‌ సుధాకర్‌రెడ్డి వేసిన వెకేట్‌ పిటీషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయశాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, భారీ పరిశ్రమల శాఖా మంత్రి జే గీతారెడ్డి, రోడ్లు, భవనాలశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎక్సైజ్‌ శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐటీ శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు నోటీసులు జారీ చేసింది.

జీవోల విడుదలలో ప్రమేయం ఉన్న 11 మంది ఐఎఎస్‌లు శ్రీలక్ష్మి, రత్నప్రభ, మన్మోహన్‌సింగ్‌, ఎస్వీ ప్రసాద్‌, సీవీఎస్‌కే శర్మ, శామ్యూల్‌, శ్యాంబాబు,ఆదిత్యనాద్‌దాస్‌, మరో ముగ్గురికి తాకీదులిచ్చింది. దీంతో అటు మంత్రులు, ఇటు ఐఎఎస్‌ల్లో కలవరం మొదలైంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ స్వాగతించింది.మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి నిజాయితీని నిరూపించుకోవాలని కోరింది. సుప్రీంకోర్టు నోటీసులతో అసెంబ్లీలో దుమారం రేగింది. కళంకిత మంత్రులు రాజీనామా చేయాలంటూ టీడీపీ పట్టుపట్టింది. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపాయి. అయితే ఇంకా నోటీసులు తమకు అందలేదని మంత్రులు అంటున్నారు. కోర్టుకెళ్ళిన అడ్వకేట్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడన్న మంత్రులు త్వరలోనే తమ నిజాయితీని నిరూపించుకుంటామంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu desam party has suffered another t shock
Swamy party to join nda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles