4gif

4.gif

Posted: 03/11/2012 12:55 PM IST
4gif

          drought2వరకట్న దురాచారం, అప్పుల బాధకు ఆ పేద తల్లిదండ్రులు ప్రాణాలర్పించాల్సి వచ్చింది. ఓ వైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక... మరోవైపు కుమార్తె పెళ్ళికి చేసిన అప్పు తీర్చలేక దళిత రైతు దంపతులు రెడ్డెప్ప, ఈశ్వరమ్మలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది.
              రెడ్డెప్ప, ఈశ్వరమ్మలు బంగాళదుంప, కాలీఫ్లవర్‌ పంటల సాగుకు మూడు లక్షల రూపాయల అప్పు చేశారు. ఇటీవల పెద్ద కుమార్తె పెళ్లికి చేసిన అప్పు తీర్చటం కూడా వారికి తలకు మించిన భారమైంది. మరోవైపు కరెంట్‌ కోతల వల్ల పంటలు చేతికొస్తాయో లేదోననే ఆందోళనతో పొలంలోనే  రెడ్డెప్ప పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో  వెళ్లాడు. అది గుర్తించిన కుటుంబసభ్యులు రెడ్డెప్పను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
           ఈ విషయం తెలిసిన రెడ్డెప్ప భార్య ఈశ్వరమ్మ పొలం దగ్గరకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని మృతిచెందింది. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్‌ఐ మురళీకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్‌ఐ హరిప్రసాద్‌, విఆర్‌ఓ రెడ్డి భాస్కర్‌లు మృతుని కుటుంబ పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Good news for cotton farmers
Dashing opener of indian cricket virendra sehwag says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles