Good news for cotton farmers

11.gif

Posted: 03/11/2012 04:59 PM IST
Good news for cotton farmers

        cottonగిట్టుబాటు ధరలేక సతమతమౌతోన్న పత్తి రైతుకు శుభవార్త.  పత్తి ఎగుమతులపై కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. పత్తి ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రమంత్రి ఆనంద్ శర్మ తెలిపారు.
             ప్రస్తుత సీజన్‌లో పత్తి దిగుబడి గణనీయంగా క్షీణించిన నేపధ్యంలో ధరలు అదుపు తప్పుతాయన్న భయాందోళనల మధ్య కేంద్రం సోమవారం పత్తి ఎగుమతులను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే.. పత్తి ఎగుమతులను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం కావటంతో కేంద్రం వెనక్కి తగ్గింది. నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్న రేపు కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
           కాగా,  పత్తి ఎగుమతులపై నిషేధంపై చర్చించడానికి బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ఇవాళ శరద్‌పవార్‌ను కలిశారు. పత్తి రైతుల వెతల గురించి శరద్‌పవార్‌తో కూలంకషంగా మాట్లాడారు.  నిషేధం ఎత్తివేయడం వల్ల ఇబ్బందులో ఉన్న పత్తి రైతులు పూరట చెందుతారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actress rakhita political entry
4gif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles