Dravid retirement announcement

Dravid retires, sad but proud, Rahul Dravid, India cricket

Rahul Dravid retirement announcement.Rahul Dravid is set to retire from international cricket on Friday - Feature stories on cricket from India.

Rahul Dravid retirement announcement.GIF

Posted: 03/09/2012 02:59 PM IST
Dravid retirement announcement

Dravidటీమిండియా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ‘ది వాల్’ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. బెంగళూర్‌లో శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాను 16 ఏళ్ల క్రికెట్ కెరీర్ ఇంత విజయవంతంగా, ఆనందంగా ముగుస్తుందని ఎప్పుడు ఊహించలేదని అన్నారు. తన కెరీర్ ఎదుగుదలకు తమ భార్యతో పాటు కుటుంబ సభ్యల సహకారం మరవలేనని, తనను అభిమానించిన  ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని, యువకులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అద్భుతమైన యుగంలో తాను భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. విచారంతోనే తప్పుకుంటున్నా గౌరవంగా ఉందని ఆయన అన్నారు.

ద్రావిడ్ 164 టెస్టు మ్యాచులు ఆడాడు. 13,288 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 36 సెంచరీలు, టెస్టుల్లో 63 అర్థ సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్, గంగూలీ, అనిల్ కుంబ్లే, హర్భజన్, సెహ్వాగ్ వంటి ఆటగాళ్లతో ఆడడం తనకు గౌరవమని ద్రావిడ్ అన్నారు. 16 ఏళ్ల పాటు ఆటపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా నేర్చుకున్నానని ఆయన అన్నారు. తన నిర్ణయాన్ని సచిన్ స్వాగతించినట్లు ద్రావిడ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Facebook
Osama bin laden brought down by one of his three wives  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles