Osama bin laden brought down by one of his three wives

osama bin laden, pakistan, terrorist, new york

A frail Osama bin Laden lived out his final days in a poisonous atmosphere cooped up with two wives who suspected a third of plotting his betrayal.

Osama bin Laden.GIF

Posted: 03/09/2012 01:58 PM IST
Osama bin laden brought down by one of his three wives

Laden‘కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్లు’ అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆల్ ఖైదా ఛీఫ్ ఒసామా బిన్ లాడెన్ చావుకి కూడా అనేక కారణాలు బయట పడుతున్నాయి. ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా దళాలు పసిగట్టి మట్టుపెట్టుపెట్టాయని బీరాలు పలికి గొప్పలు చెప్పుకున్నాయి. కానీ లాడెన్ ఆచూకీని అమెరికా దళాలకు వారి భార్యలలో ఒకరు సమాచారం ఇవ్వడం వలనే చట్టు ముట్టి చంపారనే నిజాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. దీని పై ఓ సైనికాధికారి ఇచ్చిన నివేధికే బలమైన ఆధారం.

పాక్ మాజీ సైనికాధికారి షౌకత్ ఖదీర్ ఎనిమిది నెలల పాటు శోధించి రూపొందించిన నివేదికను చూస్తే ఇదంతా నిజమేనని నమ్మవలసి వస్తోంది. ఐదుగురిలో ముగ్గురు ఆయనతో కలిసి అబోత్తాబాద్ నివాసంలో ఉండేవారని, చివరి భార్య అమల్ అహ్మద్ అల్ సదాహ్ అంటే లాడెన్‌కు అమిత ఇష్టమని, పై అంతస్తులో ఉండే తన గదిలోనే ఆమె పడక కూడా ఏర్పాటు చేశాడని, సదాహ్‌కు లాడెన్ ఇస్తున్న ప్రాధాన్యం మిగతా భార్యలకు కంటగింపుగా మారిందని, పెద్ద భార్య ఖైరియా సబేర్ ఏకంగా గొడవలకు దిగేదని, లాడెన్‌పై అలక వహించి తన పడకను కింది అంతస్తులోకి మార్చేసుకుందని, వారికి సర్దిచెప్పే సరికి లాడెన్ తల ప్రాణం తోకకు వచ్చేదని న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖదీర్ వివరించారు. లాడెన్ మరణానంతరం పాక్ దర్యాప్తు అధికారులకు ఈ విషయాలను సదాహ్ పూసగుచ్చినట్లు వెల్లడించినట్లు చెప్పారు. లాడెన్‌పై అసంతృప్తితో ఖైరియానే ఆయన ఆచూకీని అమెరికా దళాలకు అందించిందని, అందులోభాగంగానే దాడి కేంద్రమైన పై అంతస్తును ఖాళీ చేసి తన బసను కింది అంతస్తుకు మార్చుకున్నదని సదాహ్ గట్టిగా వాదించినట్టు ఖదీర్ పేర్కొన్నారు. 2005లో అబోత్తాబాద్ చేరుకునే వరకు లాడెన్ నున్నగా గడ్డం గీసుకునే వారని, ఆ తరువాత నుంచి తిరిగి బారు గడ్డం పెంచడం ప్రారంభించారని సదాహ్ వివరించినట్టు తెలిపారు. అందరూ అనుకున్నట్టు లాడెన్ భవనం దుర్భేద్యమైన కోటేమీ కాదని, కనీస భద్రతా ఏర్పాట్లు కానీ, సిబ్బంది కానీ లేరని లాడెన్ మరణానంతరం భవంతిని సందర్శించిన ఖదీర్ వెల్లడించారు.

మరి లాడెన్ ఆచూకిని కనిపెట్టి చంపామని చెప్పుకుంటున్న అమెరికా, లాడెన్ భార్యలు ఇచ్చిన సమాచారంతోనే మట్టుపెట్టాయని నిజం తేలితే... అగ్రరాజ్యం పరువు ప్రతిష్ట ఏమైపోతాయోనని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dravid retirement announcement
Chiru and renuka choudary in rajya sabha race  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles