Yuosuf fires son kcr

Yuosuf fire on kcr.GIF

Posted: 02/25/2012 01:01 PM IST
Yuosuf fires son kcr

తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ నుండి బహిష్కరణకు గురైన సయ్యిద్ యూసుఫ్ ఆలీ ఖాన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై ఫైర్ అయ్యాడు. ఒక్క కేసీఆర్ పైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యలు పై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. త్వరలో టీడీపీలో చేరబోతున్న యూసుఫ్ ఆలీ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడాడు.

గత మూడు సంవత్సరాలుగా పార్టీకి ఎంతో సేవ చేస్తూ, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నన్ను కనీసం నోటీసు ఇవ్వకుండా పార్టీ నుండి బహిష్కరించడం సరైందేనా అని కేసీఆర్ ని ప్రశ్నించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మహాకూటమి తరుపు జహీరాబాద్ నుండి పోటీ చేసినప్పుడు నన్ను ఆణిముత్యంగా అభివర్ణించిన కేసీఆర్ కు తాను ఇప్పుడు పార్టీకి, అతనికి ఎందుకు పనికి రాకుండా పోయానో చెప్పాలని ఆయన డిమాండ్  చేశారు.

మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నెతో పెట్టిన విద్య అని, తాను రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, కనీసం ఒక్కసారి కూడా పలకరించకుండా ఏకంగా తనను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ముస్లిం, దళిత వ్యతిరేకి అయిన కేసీఆర్ కేవలం తన అవసరాల కోసమే ముస్లిం దళిత ఓట్లను వాడుకుంటున్నారని ఆరోపించారు. జెండాలు మోసిన వారికి పార్టీలో స్థానం లేదని,టీఆర్‌ఎస్‌ను తిట్టిన గంప గోవర్ధన్‌కు టిక్కెట్ ఇవ్వడం కేసీఆర్ నైజాన్ని బట్టబయలు చేసిందన్నారు. ఇక నుంచి కేసీఆర్ చిట్టా విప్పి, ఆయన అసలు రంగు బయట పెడతానని, ఆయన తెలంగాణకు ఏ విధంగా మోసం చేసింది ప్రజలకు వివరిస్తానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys viveka trying for rajyasabha post
Mumbai airport runways closed for 5 hrs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles