Yeddyurappa deadline for bjp

BJP meeting, Karnataka BJP, Yeddyurappa BJP

Former chief minister of Karnataka, B S Yeddyurappa, has given an ultimatum to BJP president Nitin Gadkari demanding that by February 27, he be reinstated as chief minister or given a senior post in the party

Yeddyurappa deadline for BJP.GIF

Posted: 02/24/2012 12:59 PM IST
Yeddyurappa deadline for bjp

Yadurappaకర్ణాటకలో మళ్ళీ ముసలం మొదలైంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తన పదవిని పోగొట్టుకోవడమే కాకుండా జైలుకెళ్ళి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బిజేపీ అధిష్టానానికి మళ్లీ అల్టిమేటం జారీచేశారు. జైలు నుండి బయటకు వచ్చిన యడ్యూరప్ప గతంలో కూడా బిజేపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసి తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఆయన బీజేపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు! తన పుట్టినరోజైన ఈ నెల 27లోగా తనకు తిరిగి సీఎం పదవి ఇచ్చి తీరాలని డెడ్‌లైన్ విధించారు!! లేనట్లయితే తన దారి తాను చూసుకుంటానంటూ హెచ్చరికలు చేశారు!

మరో రెండు రోజుల్లో బెంగుళూరులో జరగనున్న పార్టీ మేథోమధనం కార్యక్రమానికి  బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వస్తున్న నేపధ్యంలో తన బలాన్ని నిరూపించుకున్నాడు. బెంగుళూరు రేస్ కోర్సు రోడ్డులోని తన నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన ‘విందు’ సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎంపీలు హాజరయ్యారు. సదానందగౌడ సీఎం అభ్యర్థిత్వానికి గతంలో యడ్యూరప్ప మద్దతిచ్చినప్పుడు వ్యతిరేకించిన గ్రామీణాభివృద్ధి మంత్రి జగదీష్ షట్టర్, హోంమంత్రి ఆర్. అశోక కూడా ఈ సమావేశానికి హాజరుకావడం గమనార్హం. అలాగే బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె.ఎస్. ఈశ్వరప్ప కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ ద్వారా యడ్యూరప్ప తన మనసులోని మాటను సూటిగా చెప్పకుండా, తన విధేయ ఎమ్మెల్యేలతో చెప్పించారు.

యడ్యూరప్ప ఎంత బలనిరూపణ చేసుకున్నా మళ్ళీ పదవి ఇచ్చే ఆలోచనలో బీజేపీ అధిష్టానం లేనట్లుగా తెలుస్తుంది. ఒక వేళ బెదిరింపులకు లొంగి గనుక ఇస్తే అవినీతి ముఖ్యమంత్రి బెదిరింపులకు లొంగి పదవి ఇచ్చినట్లుగా బీజేపీ నిలుస్తుందని కొందరు అనుకుంటున్నారు. మరి అలాంటి అవినీతి ముఖ్యమంత్రికి మళ్ళీ కట్టబెట్టడం కూడా ప్రజాస్వామ్య విరుద్దమేమో.....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Liquor syndicate
Sky falling soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles