Liquor syndicate

andhra pradesh latest news videos,CM kiran kumare reddy seeks on Liquor syndicate report,Liquor syndicate report in assembly.

andhra pradesh latest news videos,CM kiran kumare reddy seeks on Liquor syndicate report,Liquor syndicate report in assembly.

liquor syndicate.gif

Posted: 02/24/2012 02:38 PM IST
Liquor syndicate

Kanna-laxminarayanaఎట్టకేలకు మద్యం సిండికేట్లపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రకటన చేసింది. ముఖ్యమత్రి తరపున మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో 34 సిండికేట్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరిగాయన్నారు. తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ఖమ్మం, వరంగల్, శ్రీకాకుళం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ఎసిబి దాడులు నిర్వహించిందన్నారు. మద్యం సిండికేట్లపై ఏసీబీ దర్యాప్తు జరుపుతోందని ఆయన తెలిపారు. త్వరలో ఎక్సైజ్ విధానంలో మార్పులు చేయనున్నట్లు కన్నా చెప్పారు. కోర్టులో ఉన్న అంశాలను ప్రస్తావించరాదని కన్నా పేర్కొన్నారు. మద్యం సిండికేట్లతో అధికారులు కుమ్మక్కయ్యారని అధారాలు ఉన్నాయన్నారు. మద్యాన్ని ఎమ్మార్పీకి అమ్మడం వల్లే ప్రభుత్వంపై కక్ష కట్టారన్నారు.

టిడిపి హయాంలో మద్యం ఆదాయానికి భారీగా గండి పడిందన్నారు కాగా మంత్రి ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఏసీబీ నివేదికను సభ ముందుంచాలని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. మంత్రి ప్రకటనలో ఎలాంటి వివరాలు లేవని తమవద్ద ఏసీబీ నివేదికలు ఉన్నాయని, రిమాండు రిపోర్టులో ఓ మంత్రి పేరు ఉందని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారని తెలిపారు. ఆ మంత్రి పేరు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. మా వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa blamed chandrababu
Yeddyurappa deadline for bjp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles