Court directs police to book case against naidu

Court directs police to book case against Naidu, chandrababu Naidu booked in criminal case by Nampalli court for cheating,Naidu booked for 'cheating Telangan

Court directs police to book case against Naidu

Court.gif

Posted: 02/07/2012 06:17 PM IST
Court directs police to book case against naidu

Court directs police to book case against Naiduరంగా రెడ్డి జిల్లా  కోర్టులో  నమోదైన మోసం  కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ  తెదేపా  అధినేత  ఎన్. చంద్రబాబు  నాయుడు  హైకోర్టులో  పిటిషన్  దాఖలు  చేశారు.  ప్రత్యేక తెలంగాణ పై  మాటమార్చి  చంద్రబాబు తెలంగాణ  ప్రజలను మోసం చేశారని  ఆరోపిస్తూ  హైదరాబాద్ కు చెందిన  న్యాయవాదులు  జనార్థన్ గౌడ్ ,  క్రిష్ణలు  సైబరాబాద్ 11వ మెట్రోపాలిటన్  మేజిస్ట్రేట్  కోర్టులో  ప్రయివేటు  ఫిర్యాదు  దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2009 , డిసెంబర్ 9వ తేదీ కంటే  ముందు చంద్రబాబు తెదేపా  తరపున  తెలంగాణకు  అనుకూలంగా  ప్రకటించారనీ .. ఎన్నికల మ్యానిఫెస్టోలో  కూడా ప్రత్యేక  తెలంగాణకు  మద్దతు  ప్రకటించారని  వారు తమ ఫిర్యాదులో  పేర్కొన్నారు.  కేంద్ర హోంమంత్రి  చిదంబరం  ప్రకటన  తర్వాత  చంద్రబాబు  మాట మార్చి  తెలంగాణ ప్రజలను   మోసం చేశారని  ఆరోపించారు.   కోర్టు  వారి ఫిర్యాదును  సంబంధిత  పోలీసులకు  పంపించింది.  కేసు నమోదు  చేసిన  పోలీసులు విచారణ చేపట్టారు. ఫిర్యాదు దారుల ఆరోపణలకు  సరైన ఆధారాలు  లేకపోవటంతో  ఈ కేసును  మూసివేస్తున్నట్లు  పేర్కొంటూ  కోర్టుకు  తుది నివేదిక  సమర్పించారు.  దీంతో ఫిర్యాదు దారులు  అభ్యంతరం చెబుతూ ప్రొటెస్ట్  పిటిషన్  దాఖలు చేశారు.  దీన్ని  విచారణకు  స్వీకరించిన  కోర్టు.. గత నెల 9వ తేదీన  చంద్రబాబు  నాయుడుకు  సమన్లు  జారీ చేసింది.  ఈ నెల 9వ తేదీన  స్వయంగా  కోర్టుకు  హాజరు కావలని ఆదేశించింది.  ఈ నేపథ్యంలో  ఆ కేసును  కొట్టివేయాలని  అభ్యర్థిస్తూ  చంద్రబాబు  హై కోర్టును ఆశ్రయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sourav ganguly suggests playing irfan and tiwary
Method of sensex calculation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles