సెన్సెక్స్ పెరిగింది, తరిగింది అని వార్తల్లో వస్తుంటాయి. సెన్సెక్స్ ని ఎలా లెక్కిస్తారన్నది తెలియని వాళ్ళు, అందులో తెలుసుకుందామన్న ఆసక్తి గలవాళ్ళ కోసమే ఈ వివరణ. కంపెనీల్లో పబ్లిక్ (ప్రజల) వాటా షేర్లలో ఉంటుంది. అది ప్రతిరోజూ చేతులు మారుతుంటుంది. కంపెనీల్లోని షేర్లను స్టాక్ అంటారు. కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆయా కంపెనీల ప్రజావాటాలు (షేర్లు) అమ్మకాలు కొనుగోళ్ళల్లో ఏరోజు కారోజు వాటి మారకపు విలువలు మారుతుంటాయి. అవి పెరగవచ్చు, తరగవచ్చు.
మనం మాట్లాడుతున్నది వాటి మారకపు విలువల గురించి మాత్రమే. వాటి అసలు విలువ (ఫేస్ వాల్యూ) ఎప్పుడూ ఒకటే. అది మారదు. షేర్లను పబ్లిక్ కి ఆఫర్ చేసినప్పడు షేర్ విలువ 10 రూపాయలో 100 రూపాయలో ఏదో ఒక రేటు నిశ్ఛయం చేసి ఉంటుంది. అది దాని ఫేస్ వాల్యూ. దాన్ని ఎంతకి ఎక్స్చేంజ్ చేస్తారన్నది దాని మార్కెట్ వాల్యూ. మార్కెట్ లో ఒక వస్తువు ధర పెరగటానికి, తగ్గటానికి కారణాలున్నట్లే స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్ల ధరలు పెరగటానికి, తగ్గిపోవటానికి ఎన్నో కారణాలుంటాయి. దీనికి గరిష్ట ధర (ఎమ్ ఆర్ పి) అంటూ ఏమీ లేదు కాబట్టి ఎంతకైనా కొనవచ్చు, ఎంతకైనా అమ్మవచ్చు.
సెన్సెక్స్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్ లో చాలా ప్రధానమైన అంశం. జాతీయ స్తాయిలో జరిగే బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్ఇ) లో సెన్సెక్స ప్రారంభ రేటు, ముగింపు రేటు వార్తల్లో వస్తుంటాయి. సెన్సెక్స్ అనేది షేర్ల మార్కెట్ సూచిక. దీనితో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందన్నది అర్థమౌతుంది. షేర్ల విలువలు పెరుగుతున్నాయా లేకపోతే తరుగుతున్నాయా అన్నది తెలుస్తుంది. దానితో పెట్టుబడులు పెట్టాలా లేకపోతే ఉన్నవే అమ్ముకోవాలా, లేదా కొన్నాళ్ళు వేచి చూడాలా అన్నది షేర్ హోల్డర్స్ నిర్ణయించుకుంటారు.
షేర్లు కొనేవారు, అమ్మేవారూ ఎప్పుడూ ఉంటారు. సెన్సెక్స్ పెరిగినా సరే లేదా తరిగినా సరే. కొందరు షేర్లను రేట్లు పెరుగుతున్న దశలో కొంటారు, కొందరు తరుగుతున్న దశలో కొంటారు. పెరుగుతున్నప్పుడు ఇంకా పెరుగతుందనే భావనలో కొనేవాళ్ళు కొందరుంటే, తరిగిపోయేటపుడు మళ్ళీ పెరుగుతాయని కొందరు కొంటారు. అలాగే, పెరిగుతున్నప్పుడే అమ్ముకుందామని కొందరు అమ్మేసుకుంటే, తరిగిపోతున్నప్పడు ఇంకా తరిగిపోతుందేమో నని అమ్ముకునేవారు మరికొందరుంటారు. అందువలన మారకం ఎప్పుడూ ఉంటుంది. కానీ సెన్సెక్స్ వలన వారికి నిర్ణయం తీసుకోవటానికి ఉపయోగపడుతుంది.
సెన్సెక్స్ లెక్కించే విధానం ఇలా ఉంటుంది-
బిఎస్ఇ లో ఉన్న 30 లిస్టెడ్ కంపెనీలను తీసుకుని వాటి ఫ్రీ ఫ్లోట్ ని మార్కెట్ కాపిటలైజేషన్ పద్ధతిలో లెక్కిస్తారు.
మార్కెట్ కాపిటలైజేషన్ అంటే షేర్ల పరంగా ఒక కంపెనీ మార్కెట్ విలువ. అంటే, ఆ కంపెనీ షేర్లను ప్రస్తుతపు మార్కెట్ రేట్లతో లెక్కకట్టటం. మరోవిధంగా చెప్పాలంటే ఆ కంపెనీ షేర్లన్నిటినీ అమ్మేస్తే ఎంత వస్తుంది అన్న లెక్క. ఆ కంపెనీ షేర్ల సంఖ్యను మార్కెట్ రేటుతో గుణిస్తే వచ్చేది కాపిటలైజేషన్.
ఇక ఫ్రీ ఫ్లోట్ అంటే, మార్కెట్ లో అమ్మగలిగిన షేర్లు. కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినపుడు అన్ని షేర్లనూ అమ్మకానికి పెట్టటానికి ఉండదు. అందులో కొన్ని ఇన్వెస్టర్స్ షేర్లుంటాయి. సంస్థాపకులు, డైరెక్టర్ల షేర్లు, షేర్ల మీద హోల్డింగ్ ఉన్నవి, లాక్డ్ ఇన్ షేర్లు ఇలాంటివి పోను మార్కెట్ లో ఎక్స్చేంజ్ చెయ్యగలిగిన షేర్లను ఫ్రీ ఫ్లోటే షేర్లంటారు.
అందువలన ఫ్రీఫ్లోట్ మార్కెట్ కాపిటలైజేషన్ అంటే, ఫ్రీ మార్కెట్ లో ఎక్స్చేంజ్ చెయ్యగల షేర్ల సంఖ్యను వాటి మార్కెట్ రేటుతో గుణించగా వచ్చిన మొత్తం.
ఈ ఫ్రీఫ్లోట్ మార్కెట్ కాపిటలైజేషన్ ని బిఎస్ఇ లో లిస్ట్ అయిన ఒక 30 కంపెనీలకు ఎంత అన్నది చూస్తారు.
ప్రతి కంపెనీ కూడా బిఎసిఇ కి తమ కంపెనీలో ఉన్న షేర్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అందులో ఫ్రీఫ్లోట్ ఎంతో తెలిసిపోతుంది. అది మారవచ్చు కూడా. లాక్ ఇన్ పీరియడ్ అయిపోవటం, లేదా బోనస్ షేర్లు ఇవ్వటం ఇలాంటి వాటివలన ఫ్రీఫ్లోట్ షేర్ల వివరం మారుతుంటుంది.
సెన్సెక్స్ వాల్యూ అంటే ఫ్రీఫ్లోట్ మార్కెట్ కాప్ ని సెన్సెక్స్ బేస్ వాల్యూతో చూడటం. ఉదాహరణకు ఒక లక్షను బిఎసిఇ 3000 గా తీసుకుందనుకుందాం. ఆ లెక్కన 3 లక్షలంటే బిఎస్ఇ వాల్యూ 9000. లెక్కించటానికి వీలుగా సంఖ్యను చిన్నగా చేసుకునేదే బేస్ వాల్యూ.
ఇక 30 కంపెనీలనే ఎందుకు తీసుకోవటం, ఏమిటా 30 కంపెనీలు అంటే, గాలివాటుగా తరిగే పెరిగే షేర్ల విలువలు సరైన ఫలితాన్ని చూపించవు కాబట్టి ఒక 30 కంపీలను ప్రామాణికంగా తీసుకుంటారు. వాటిని గుర్తించటానికి ఇండెక్స్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కమిటీలో ఆర్థికశాస్త్రవేత్తలు, మ్యూచ్యువల్ ఫండ్ వాళ్ళూ, ఫైనాన్స్ జర్నలిస్ట్ లు, ఇతర బోర్డ్ సభ్యులు ఉంటారు. వారు ఆ 30 సంస్థలను ఎంపిక చేస్తారు.
30 కంపెనీలను ఎంపిక చెయ్యటానికి వారు తీసుకునే ప్రమాణాలు ఇవి-
1. మార్కెట్ కాపిటలైజేషన్ లో టాప్ 100 లో ఉండాలి
2. మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ లో వారి వాటా 0.5 శాతం ఉండాలి.
3. ట్రేడ్ నడుస్తున్న రోజుల్లో ప్రతిరోజూ ఆ సంస్థ బాపతు షేర్లు ట్రేడింగ్ లో ఉండాలి.
4. గత సంవత్సరంలో ఆ సంస్థ షేర్లు ఒక రోజుకి లెక్కించే సగటు ట్రేడింగ్ లో టాప్ 150 లో ఉండాలి
5. పరిశ్రమలో ఆ సంస్థ అగ్ర స్థానంలో ఉండాలి.
6. బిఎస్ఇ లో కనీసం ఒక సంవత్సరం లిస్టింగ్ లో ఉండివుండాలి.
7. ఇండెక్స్ కమిటీ దృష్టిలో ఆ సంస్థకి చక్కటి ట్రాక్ రికార్డ్ ఉండాలి.
ఈ విధంగా ఎంపికైన 30 కంపెనీల ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాప్ ని బిఎస్ఇ బేస్ తో చూస్తే వచ్చేదే సెన్సెక్స్. అది ట్రేడింగ్ మొదలైనప్పడు ఉన్న రేటు సెన్సెక్స ప్రారంభ దశ, ముగింపు సమయంలో ఉన్నది ముగింపు దశ.
షేర్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు దాన్ని బుల్ మార్కెట్ అంటారు. తరుగుతున్నప్పుడు బేర్ మార్కెట్ అని అంటారు. మార్కెట్ లో బుల్స్ ఉంటారు, బేర్స్ ఉంటారు. బుల్లిష్ మార్కెట్ లో కొనుగోలు చేసేవారు బుల్స్, బేరిష్ మార్కెట్ కొనుగోలు చేసేవారు బేర్స్ అని స్టాక్ మార్కెట్ పరిభాషలో పిలవబడతారు.
ఈరోజు ఉదయం బిఎస్ఇ సెన్సెక్స్ 121.4 పాయింట్లు పెరిగింది. దాన్నే 0.68 శాతం పెరుగుదలగా కూడా సూచించింది. 17821.71 కి పెరిగింది.
హాంగ్ కాంగ్ లో హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.13 శాతం వృద్ధిచెందింది, జపాన్ నిక్కై ఇండెక్స్ 0.43 శాతం తరిగింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more