Ias officers seek cms help against cbi probe

IAS officers seek CM's help against CBI probe,IAS officers meeting with CM, IAS officers memorandum to CM, Meeting of IAS officers, IAS officers’ grouse against CBI, IAS officers’ complaint against CBI

IAS officers seek CM's help against CBI probe

IAS.gif

Posted: 02/04/2012 11:06 AM IST
Ias officers seek cms help against cbi probe

Why this partiality IAS officers ask CM

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటన్న పరిణామాలపై ఐఎఎస్‌ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు తమను బలిపశువులను చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విచారణలో నిబంధనలు పాటించేలా సిబిఐకి దిశానిర్థేశం చేయాలని వారు ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఇదే డిమాండ్‌తో ప్రధానమంత్రిని కలవాలని ఆలోచిస్తున్నారు. అవసరమైతే ఒక రోజు పెన్‌డౌన్‌ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అమాత్యులకు తెలియకుండా తామేమి నిర్ణయాలు తీసుకోవడం లేదని, అలా తీసుకోవడం కూడా సాధ్యం కాదని వారు ముఖ్యమంత్రికి చెప్పారు. అమాత్యులను కాదని నిర్ణయాలు తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డిని రాష్ట్ర ఐఎఎస్‌ల సంఘం ఆధ్వర్యంలో 70 మంది అధికార్లు కలిశారు. రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలపై సిబిఐ విచారణ జరుగుతున్న తీరుపై సిఎంకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాష్ట్ర ఐఎఎస్‌ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ మహాపాత్రో, ఆ సంఘం కార్యదర్శి రేమండ్‌ పీటర్‌ విలేకరులతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ప్రశాంత్‌ మహాపాత్రో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవలు అందించేందుకు తాము ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని తమకు కల్పించాలని సిఎంను కోరామన్నారు. పారదర్శకంగా, సమర్థవంతంగా పాలన నడిపించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల్లో సిబిఐ అధికారులు తమను నేరదృష్టితో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి కేవలం అధికారులపైనే సిబిఐ ఎక్కుపెడుతోందన్నారు. విచారణ కోసం మంత్రుల ఇళ్లకు సిబిఐ అధికారులు వెళ్తున్నారని, అదే తమను పిలిపించుకొని విచారణ పేరుతో వేధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లోనూ తమ పాత్ర చాలా పరిమితమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పేపర్‌పై పెట్టడం, సంబంధిత ఫైల్‌ను పంపే వరకే తమ బాధ్యత ఉంటుందన్నారు. కానీ తమ సంతకాన్ని మాత్రమే సిబిఐ పరిగణనలోకి తీసుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. అధికారులపై నేరాన్ని నెట్టివేసే ప్రయత్నం సిబిఐ అధికారులు చేస్తున్నారని తెలిపారు. అధికారులను విచారణ చేసే ముందు సిబిఐ అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా విచారణ చేయడం సరైంది కాదని తెలిపారు. ఒకవేళ ఏదైనా అధికారిని విచారించాలనుకుంటే ఆ అధికారి శాఖకు చెందిన సీనియర్‌ అధికారుల సాక్ష్యంతోనే, వారి కార్యాలయంలోనే విచారణను చేపట్టాలని నిబంధనల్లో ఉందని తెలిపారు. వీటన్నింటిపై అడ్వకేట్‌ జనరల్‌, న్యాయశాఖతో చర్చించిన తర్వాత మరో దఫా సమావేశమౌదామని సిఎం తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Are ias becoming scapegoats
Abhishek singhvi blames 2g scam on nda govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles