Supreme court judgement reg license cancellation

supreme court judgement reg license cancellation, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

supreme court judgement reg license cancellation, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

analysis-1.gif

Posted: 02/03/2012 06:35 PM IST
Supreme court judgement reg license cancellation

జస్టిస్ జిఎస్ సింఘ్పి, జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీలో ధర్మాసనం నిన్న 2జి కుంభకోణంమీద ఇచ్చిన 74 అంశాలతో కూడిన ప్రతిష్టాత్మకమైన తీర్పులో కీలకమైన టెలికాం సంస్థలకిచ్చిన లైసెన్స్ లను రద్దు చెయ్యటం మీద ఈ విధంగా వివరించింది.

సంఖ్య 69- ముందు వచ్చినవాళ్ళకే ముందు ఇవ్వటమనేది చాలా దోషపూరితమైన నిర్ణయం. ఇందులో ఎన్నో తప్పులు దొర్లే అవకాశముంది. ప్రజకు చెందిన ఆస్తులను ఈ పద్ధతిలో కేటాయించటం ప్రమాదకరమైనది. ఎవరికైతే ప్రభుత్వ కార్యాలయాల్లో సత్సంబంధాలుంటాయో వారికి ఈ విషయం ముందుగా తెలిసిపోతుంది. దానితో ఆ సంస్థ లేదా వ్యక్తి వెంటనే తన అభ్యర్థనను దాఖలు చేస్తారు. దానితో, అంతకంటే ఎక్కువ ప్రయోజనం గల ప్రతిపాదనలు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. స్పెక్ట్రమ్ లాంటి అరుదైన విషయాలలో ప్రభుత్వం వేలం పద్ధతిలోనే కేటాయింపులను నిర్వహించవలసి వుంటుంది. లేకపోతే జాతీయ సంపదంతా ప్రజాహితం కోరుకోని, రాజ్యాంగం పట్ల గౌరవ మర్యాదలు లేని, అక్రమ సంపాదనే లక్ష్యంగా వర్తించే స్వార్థపరుల చేతుల్లోకి పోయే ప్రమాదముంది.

సంఖ్య 70- సెప్టెంబరు 2007 నుండి మార్చి 2008 మధ్యలో సమాచార శాఖ అధికారులు సమాచార శాఖా మంత్రి ఎ.రాజా ఆధ్వర్యంలో అవలంబించిన విధానం కేవలం పక్షపాత విధానం. ఇది ప్రజాహితంలో నష్టపరచే చర్యే కాకుండా, సమానత్వం అనే సిద్ధాంతానికి కూడా వ్యతిరేకం. కోర్టు ముందు ప్రవేశపెట్టిన ఆధారాలను బట్టి చూస్తే సమాచార శాఖా మంత్రి ప్రభుత్వాదాయానికి గండిపెడుతూ, స్వార్థపూరితంగా తనకి ఇష్టులైన వారికి వారి సంస్థలకు కట్టబెట్టే ఉద్దేశ్యంతోనే ఈ క్రింది చర్యలు తీసుకున్నారు.

  1. 1.సమాచార శాఖకు మంత్రిగా పదవిలోకి వస్తూనే యు.ఏ.ఎస్ లైసెన్స్ ల కోసం వచ్చిన అభ్యర్థనలను భారత సమాచార నియంత్రణా సంస్థ (ట్రాయ్) సూచనలు వచ్చేంతవరకూ పక్కకు పెట్టమని ఆదేశించారు.
  2. 2.28.8.2007న ట్రాయ్ ఇచ్చిన సలహాలను సంపూర్ణంగా టెలికాం కమిషన్ ముందు ఉంచలేదు. ఆ కమిషన్ లో ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఉండవలసింది. టెలికాం కమిషన్ సమావేశంలోని అంశాలను శాశ్వత సభ్యత్వం లేనివారికెవరికీ అందుబాటులోకి తేలేదు.
  3. 3.10.10.2007 లో హజరైన సమాచార విభాగంలోని అధికారులకు సమాచార మంత్రి భయం వలన, ట్రాయ్ సూచనలను పాటించటం తప్ప మరో మార్గమేమీ లేదు.
  4. 4.మంత్రివర్గం సూచించినదాన్నిబట్టి సమాచార విభాగం స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయించటానికి ముందు ఆర్థిక శాఖతో సంప్రదించవలసివుంది. కానీ 2001 లో నిర్ణయించిన ధరలకు ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శి సుముఖంగా లేరని తెలుసు కాబట్టి, ఆర్థిక మంత్రిని కానీ, ఆర్థిక మంత్రిత్వ శాఖలో అధికారులను కానీ సంప్రదించలేదు.
  5. 5.ఈ స్పెక్ట్రమ్ అంశాన్ని నియమిత మంత్రివర్గం ముందు ప్రవేశపెట్టాలని సూచించిన న్యాయ మంత్రిత్వ శాఖ సూచనలను సమాచార శాఖా మంత్రి పట్టించుకోలేదు. అంతేకాదు, 2.11.2007లో ప్రధాన మంత్రి నుంచి, అరుదైన స్పెక్ట్రమ్ విషయంలో పారదర్శకత, సమానత్వాల కోసం వేలం పద్ధతిని పాటించవలసిందిగా కోరుతూ వచ్చిన లేఖను విస్మరిస్తూ, దాన్ని అందుకున్న కొన్ని గంటల్లోనే అదంతా సరైనది కాదని, పక్షాపాత పద్థతి అవుతుందని, కొత్తవాళ్ళకి కట్టబెట్టటం అవుతుందని ప్రధాని సూచనను సమాచార శాఖ మంత్రి తిరస్కరించారు. అంతకు ముందు రోజే అభ్యర్థనలు అందటానికి 1.10.2007 ని ఆఖరు రోజుగా సమాచార విభాగం ప్రకటన వెలువడినా, దాన్ని తోసిపుచ్చుతూ, ఆఖరు తేదీని 25.9.2007 గా ఇంకా దగ్గరకు తీసుకుని వచ్చారు. ఇదంతా తెలివితక్కువ పనిగా కనిపిస్తున్నా, నిజానికి సమాచారా శాఖ మంత్రి, 24.9.2007 నాడు అంటే ఆఖరు తేదీకి ఒకరోజు ముందు అభ్యర్థనలు పంపిన అనుభవం లేని కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు కట్టబెట్టటం కోసం చేసిన పనేనని కచ్చితంగా తెలుస్తోంది.
  6. 6.ఆఖరు తేదీని 25.9.2007 గా మార్చిన విషయం సమాచార శాఖా మంత్రి 10.1.2008 వరకూ పబ్లిక్ కి వెల్లడించలేదు. 2003 నుంచి పాటిస్తూ వస్తున్న ముందు వచ్చినవారికి ముందు కేటాయింపు అనే పద్ధతికి మారుస్తున్నట్టుగా కూడా ఆఖరు క్షణంలో 10.1.2008 నాడు చేసిన ప్రకటనలో వెల్లిడించారు. దీనివలన మంత్రిత్వశాఖతో సంబంధాలున్నవారు మాత్రమే అనుమతులు తీసుకోవటానికి చెల్లించవలసిన బ్యాంక్ గ్యారెంటీలు డ్రాఫ్ట్ లు 1600 కోట్ల రూపాయల మేరకు తీసుకోవటానికి వీలైంది.
  7. 7.10.1.2008 నాడు స్పెక్ట్రమ్ అభ్యర్థులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ లు అందజేసిన విధానం చూసినా తంతంతా కేవలం ఒక నాటకంలా జరిగిందని, ముందు వచ్చినవారికే ముందు కట్టబెడతారని ముందుగానే తెలిసినవారికే ఆ లబ్ధి చేకూరిందని తెలుస్తోంది.

సంఖ్య 71- స్పెక్ట్రమ్ కేటాయింపులు నిజాయితీగా జరగలేదని కోర్టు భావిస్తున్న పక్షంలో 2001 నుండి ఇచ్చిన లైసెన్స్ లను రద్దుచేయమని సీనియర్ కౌన్సిల్ శ్రీ హరీష్ సాల్పే సూచన కూడా అంగీకరించే విధంగా లేదు. ఎందుకంటే, 2001 నుండి 24.9.2007 మధ్యలో లైసెన్స్ పొందినవారు ఈ పిటిషన్ లో లేరు, పైగా వారు పొందిన లైసెన్స్ లను ఈ కోర్టు ముందు వ్యతిరేకించలేదు.

సంఖ్య 72- అటర్నీజనరల్, ప్రతివాదుల కౌన్సిల్ ల వాదోపవాదనల వలన ఈ తీర్పులో కోర్టు అత్యంత జాగరూకతను పాటించాలని నిర్ణయించుకున్నదే కానీ, ప్రభుత్వం తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాలలో ఈ కోర్టు నిస్సందేహంగా ఎటువంటి జోక్యం చేసుకోదన్నది నిర్వివాదం. అయితే విస్తృత పరిధిలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణాయలు లోపభూయిష్టమని, ప్రజాప్రయోజనలాకు నష్టం కలుగుతున్నదని కోర్టు ముందుకి వచ్చిన తరుణంలో కోర్టు తనకున్న అధికారాలను ఉపయోగించుకుని దాన్ని సరిచెయ్యటమన్నది అవశ్యకం. దేశ ప్రయోజనం దృష్ట్య ఎవరైనా వ్యాజ్యం వేసినపుడు, ఇటువంటి విషయాల్లో, ప్రజలు విశ్వసించి అధికారాలను చేతిలో పెట్టినవారే చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన సందర్భంలో ప్రజాహితంలో కోర్టు కలుగజేసుకోక తప్పదు.

సంఖ్య 73- దీన్ని ముగింపు తీసుకొచ్చే ముందుగా, పౌరులలో కొందరు విఙానులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వంలో ప్రక్షాళనకోసం, జవాబుదారీ కోసం పాటు పడకపోతే ఇటువంటివి అమాయక జనుల దృష్టికే రావని చెప్పక తప్పదు. అదే లేకపోతే, రక్షణశాఖకు చెందిన ఈ అరుదైన అంశాన్ని కొందరు ధనబలంతో ప్రభుత్వ శాఖలను గుప్పిటిలో పెట్టుకుని ఇలా వాటిని చేజిక్కించుకుంటారని తెలిసేది కాదు.

సంఖ్య 74- ఈ పిటిషన్ ని సమ్మతిస్తూ ఈ క్రింది తీర్పులు ఇవ్వటం జరిగింది-

  1. 1.10.1.2008 నాడు చేసిన ప్రకటన ప్రకారం 10.1.2008 తర్వాత ఇచ్చిన లైసెన్స్ లను రద్దు చెయ్యటమైనది.
  2. 2.పైన తెలియజేసింది నాలుగు నెలల తర్వాత అమలులోకి వస్తుంది.
  3. 3.ఈలోపులో రెండు నెలల్లో 2జి బాండ్ ని కేటాయించటానికి ట్రాయ్ 3జ విషయంలో జరిగినట్టుగానే వేలం పద్ధతిలో జరిపించాలని సూచించాలి.
  4. 4.ఆ తర్వాత ఒక నెలలో ప్రభుత్వం దాన్ని పరిశీలనలోకి తీసుకుని వేలం పద్ధతిలో కొత్త కేటాయింపులు జరపాలి.
  5. 5.రెస్పాండెంట్ సంఖ్య 2,3,9 సంస్థలు సమాచార విభాగం నుంచి అక్రమంగా సంపాదించిన లైసెన్స్ ల బలంతో వేల కోట్ల రూపాయలకు షేర్ల రూపంలో అమ్ముకున్నందువలన వారు 5 కోట్ల రూపాయలు చొప్పున జరిమానా కట్టవలసివుంది. రెస్పండెంట్ సంఖ్య 4, 6, 7, 10 సంస్థలు కూడా అక్రమంగా లైసెన్స్ లు సంపాదించినందువలన వారు కూడా 50 లక్షల చొప్పున జరిమానా కట్టవలసివుంది.
  6. 6.పై జరిమానాలో 50 శాతం సుప్రీం కోర్టు న్యాయ సహాయ కమిటీకి వ్యాజ్యం వేసేవారి సహాయం కోసం, మిగతా 50 శాతం ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కి జమకట్టవలసివుంది.
  7. 7.ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సిబిఐ, ఇడిల మీద కోర్టు ఉద్దేశ్యాలు, కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రభావం ఉండకూడదు. ఈ కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి కోర్టువారి ఈ తీర్పుని పరిగణనలోకి తీసుకోగూడదు.                                                   -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chidambarams matter referred to trial court
Pm always says that all is well  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles