Political rowdilu

political rowdilu, Uttapradesha Elections, UPEW, 876 Members, Womens,

political rowdilu

political.gif

Posted: 01/30/2012 03:05 PM IST
Political rowdilu

నేరగాళ్లు.. పన్ను ఎగవేతదారులు.. కోటీశ్వరులు... ఇప్పుడు ఉత్తరవూపదేశ్ ఎన్నికలను శాసిస్తున్నారు..! బరిలో వారే ముందుస్థానంలో ఉన్నారు. మగువలకు పెద్దపీట వేస్తామంటున్న పార్టీల్లోనైతే పట్టుమని ఐదు శాతం మంది మహిళలు కూడా పోటీ చేయడం లేదు. వచ్చేనెల 8న యూపీలో మొదటి దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 867 మంది నామినేషన్లు సమర్పించారు. వీరిలో 284మంది నామినేషన్, అఫిడవిట్ పత్రాలను ఉత్తరవూపదేశ్ ఎలక్షన్ వాచ్(యూపీఈడబ్ల్యూ) క్షుణ్ణంగా పరిశీలించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 284 మందిలో 109 మంది (38శాతం)కి నేర నేపథ్యం ఉన్నట్లు తేలింది. వీరిలో 46 మందికి హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాపులు, దోపిడీలు, బలవంతపు వసూళ్లు వంటి ప్రధాన కేసులతో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. 

యూపీ ఎన్నికల బరిలో దిగుతున్నవారిలో నేరస్తులే కాదు.. పన్ను ఎగవేతగాళ్లూ ఉన్నారు. 96మంది (34శాతం) మంది అభ్యర్థులు ఏనాడు కూడా పన్ను కట్టిన పాపాన పోలేదట. వీరిలో ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న బడా కోటీశ్వరులు ఫరీద్ మహఫూజ్ కిద్వాయి, కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్న గౌరీ శంకర్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రామ్‌సజీవన్ తదితరులు ఉన్నారు. మొదటి దఫా ఎన్నికల బరిలో కోటీశ్వరులకూ ఏ మాత్రం కొదవ లేదు. 284 మంది నామినేషన్లు, అఫిడవిట్లను పరిశీలించగా 144 మంది (51శాతం) కోటీశ్వరులుగా తేలింది. ఆరుగురు మాత్రమే లక్ష రూపాయలలోపు ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించింది. మహిళలకు అందలమేస్తున్నట్లు మ్యానిఫెస్టోల్లో దాదాపు అన్ని పార్టీలు ప్రకటించాయి. మొదటి దఫా ఎన్నికల బరిలో మొత్తం 867 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీరిలో 65 మంది(7శాతం) మాత్రమే మహిళలు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cricket bat
Acb raids liquor syndicates excise officials across state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles