India celebrates 63rd republic day today

India celebrates 63rd Republic Day today,wishes you a Happy Republic Day, Republic day celebration

India celebrates 63rd Republic Day today

India.gif

Posted: 01/26/2012 12:37 PM IST
India celebrates 63rd republic day today

India celebrates 63rd Republic Day today ఈ రోజు రిపబ్లిక్ డే. తెలుగు చెప్పాలంటే గణతంత్రదినోత్సవం. మనలో చాలామందికి స్వాతంత్ర్య దినోత్సవానికి , గణతంత్ర దినోత్సవానికి తేడా ఏమిటనే సందేహం కలుగుతుంది. అందుకే దీని గురించి మనం తెలుసుకుందాం.
సుదీర్ఘ కాలంపాటు భారతేదేశం బ్రిటిష్ పాలనలో మగ్గిపోయింది. బ్రిటిష్ వారు చేసిన చట్టాలే ఆ కాలంలో అమలయ్యేవి. 1947 ఆగస్టు 15న భారత దేశం స్వాతంత్ర్యం పొందింది. స్వేచ్ఛ పొందిన భారతీయులు తమకు తాముగా ఒక సొంత రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాలనుకున్నారు. దీని కోసం రాజ్యాంగ సభ ఏర్పటైంది. భారత రాజ్యాంగ రచనా సంఘానికి డా.బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా పనిచచేశారు. ఈ రాజ్యాంగ సభ 2 సంవత్సరాల 11 నెలల,18 రోజుల కాలం రాజ్యాంగ రచనకు కష్టపడ్డారు. కొత్తగా రూపొందించుకున్న రాజ్యాంగ 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం భారత్ సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశమైంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ అంటే ప్రభుత్వాధికారం ప్రజలచేతుల్లోనే ఉండటం, అందువల్లే ఇది మనకెంతో ముఖ్యమైన, పవిత్రమైన దినం.
ప్రతి సంవత్సరం మనం రిపబ్లిక్ డే ను జరుపుకోవటంలో ఒక ఉద్దేశం దాగుంది. అది , మన రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన పవిత్ర కర్తవ్యాన్ని గుర్తుచేసుకోవడమే. మనం అప్రమత్తంగా లేకపోతే మన స్వేచ్చను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది.
ఈ రోజున దేశరాజధానిలోనూ, దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లోను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, కవాతులు నిర్వహించడం, దేశం పట్ల మన కర్తవ్యాన్ని గుర్తుచేసుకోవడం పరిపాటి. మరి భావిభారత పౌరులైన ప్రతి ఒక్కరు రిపబ్లిక్ డే రోజున జెండావందనం చేయటం వలన మన బాధ్యత గుర్తుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Senior ias officer y sri lakshmi
Obama wont ask me to stay in a 2nd term  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles