తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఊహించినదానికంటే ఎక్కువ చురుగ్గా తిరుగుతూ నందమూరి బాలకృష్ణ మీసాలు మెలేసి, తొడగొట్టి కృష్ణా జిల్లాలో పార్టీలో ఉత్సాహాన్ని నింపారు. ఘంటసాల లో దివంగత నేత తెదేపా సంస్థకు మూలపురుషుడైన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆ తర్వాత జరిగిన సభలో, సమాజంలో అందరికీ సమాన న్యాయం జరిగేలా సామాజిక న్యాయాన్ని అప్పుడే ఆ రోజుల్లోనే పాటించారని గుర్తుచేస్తూ, రాజకీయ పార్టీలు కొన్ని కేవలం ఒక నినాదంలో ఈ రోజుల్లో దాన్ని వాడుకుంటున్నారని బాలయ్య అన్నారు.
ఎన్టీఆర్ నినదించిన తెలుగువాడి ఆత్మగౌరవం కేంద్రంలో తాకట్టు పెట్టే అంశాన్ని తిరిగి లేవనెత్తి, 32 ఎంపీలున్నా తెలుగువారికి మంత్రి పదవులెన్ని దక్కాయో చూస్తేనే అర్థమౌతున్నదని బాలకృష్ణ అన్నారు. 2003లో మొలకలెత్తిన బియ్యాన్ని కూడా తెదేపా కొనుగోలు చేసి రైతులను ఆదుకుందని, ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని బాలకృష్ట వాపోయారు.
ఎన్టీఆర్ గొప్పతనం, తెలుగు దేశం పార్టీ ప్రాభవం గురించి మాట్లాడిన బాలకృష్ణ ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరెత్తకపోవటం విశేషం. అయితే, బాలయ్య ఎంత వక్తో అందరికీ తెలుసు కాబట్టి అందులో ఏదో రాజకీయముందని అనుకోవలసిన వీలు లేదు. ప్రస్తుతం ఆకట్టుకునే విగ్రహం కొరవైన తెదేపాలో బాలకృష్ణ నడుం బిగించటమే చాలు నూతనోత్సాహాన్ని నింపటానికి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more