Renuka chaudhary as rajya sabha member race

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Renuka Chaudhary.gif

Posted: 12/30/2011 10:15 AM IST
Renuka chaudhary as rajya sabha member race

Renuka-Choudaryకాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఈసారి ఎవరు ఎంపిక అవుతారన్నదానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. రాజ్యసభలో ఈసారి భారీగా ఖాళీలు ఏర్పడ నున్నాయి. దీంతో ఎవరు ఎంపిక అవుతారనే దాని పై అప్పుడే చర్చలు జోరందుకున్నాయి.  కాంగ్రెస్ కు చెందిన నలుగురు, సిపిఐ కి చెందిన ఒకరు, టిడిపికి చెందిన ఒకరు ఈసారి రిటైర్ కానున్నారు. కాంగ్రెస్ పక్షాన గతసారి అభ్యర్ధులుగా ఎంపికైన పిసిసి మాజీ అద్యక్షుడు డాక్టర్ కె.కేశవరావు, ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, ఐఎన్ టి యుసి అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, ఉత్తరప్రదేశ్ కు చెందిన నేత రషీద్ అల్వీ వీరిలో ఉన్నారు.అప్పట్లో మిత్ర పక్షంగా సిపిఐ పక్షాన అజీజ్ పాషా, టిడిపి తరపున మాజీ మంత్రి డాక్టర్ ఎమ్.వి.మైసూరారెడ్డి ఎన్నికయ్యారు.

అయితే ఈసారి కాంగ్రెస్ అభ్యర్దులలో ఇవ్వదలిస్తే ఒక్క సంజీవరెడ్డికే తిరిగి అవకాశం రావచ్చని చెబుతున్నారు. పార్టీ కార్మిక విభాగానికి సంబంధించి ఆయన ముఖ్యమైన నేతగా ఉండడం దీనికి కారణం చెబుతున్నారు. దాసరి నారాయణరావు ఇప్పటికే రెండుసార్లు పదవి ఇచ్చినందున ఈసారి ఇవ్వకపోవచ్చు. కొత్తగా అవకాశం వచ్చే వారిలో మెగాస్టార్ చిరంజీవి పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినందుకు ప్రతిఫలంగా ఆయనకు రాజ్యసభ ఇవ్వాలని నిర్ణయించారు.అలాగే దాసరి నారాయణరావు బదులుగా ఈయనకు అవకాశం రావచ్చు. ఇక మరోస్థానానికి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవలికాలంలో ఆమెకు డిల్లీ కాంగ్రెస్ రాజకీయాలలో ప్రాధాన్యత పెరుగుతోందని, దానికి నిదర్శనంగా పార్టీ అధికార ప్రతినిది హోదా కల్పించడం కూడా గమనించవలసిన అంశమని చెబుతున్నారు. సోనియాగాందీతో సత్సంబంధాలు కలిగిన రేణుకా చౌదరికి ఈ అవకాశం రావచ్చని అంటున్నారు.

ఢిల్లీస్థాయి రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న రేణుకా చౌదరికి రాజ్యసభ పదవి ఇవ్వడాన్ని తెలంగాణకు చెందిన కొంతమంది నాయకులు వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు.ఈ మద్యకాలంలో తెలంగాణ అంశంపై హాట్ హాట్ వ్యాఖ్యలు చేసిన ఆమె వారికి ఆగ్రహం తెప్పించడమే ఇందుకు కారణం. వీటిని అధిగమించి రేణుకా చౌదరి రాజ్యసభ పదవి పొందగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశంగాఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr promises to cut his throat for t stir
Lokpal bill has always appeared to be a jinxed affair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles