Kcr promises to cut his throat for t stir

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

KCR promises to cut his throat for T- stir. Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

KCR promises to cut his throat for T- stir.gif

Posted: 12/30/2011 10:22 AM IST
Kcr promises to cut his throat for t stir

Kcrతెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ తన మాటల గారడితో అందరిని రెచ్చగొడతాడు. గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతున్నా ఇంతవరకు తెలంగాణ రాలేదు కానీ ఉద్యమం మాత్రం ప్రజల నరనరాల్లో ఇముడింప జేశారు. దానికి కారణం మాత్రం కేసీఆర్ అనే చెప్పాలి. కేసీఆర్ ఎప్పుడైనా ఉద్యమం చల్లారే పరిస్థితి వచ్చినప్పుడు దానికి పొగ వేస్తాడు. అది రాజుకుని మంటలాగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం అదే చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుండి చల్లబడ్డ ఉద్యమాన్ని సంక్రాంతి తర్వాత... జనవరి 18 నుంచి తెలంగాణలో ఉద్యమాన్ని మళ్ళీ ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

త్వరలో జేఏసీ పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకుందని, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోకపోతే కట్టుబానిసలుగా మిగిలిపోతామని హెచ్చరించారు. తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు వెంట 500 మంది గుండాలు రాళ్ళు, కర్రలతో వెళుతున్నారని ఆరోపించారు. అంతేగాక, రెండు వేల మంది పోలీసులను కూడా నియమిస్తున్నారని చెప్పారు. "మిమ్మల్ని తరిమికొట్టడం మాకు చేతకాదా? 11 సంవత్సరాలుగా సహనంతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం'' అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాకపోక మెడ కోసుకుంటానని  తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2012 డైరీ ఆవిష్కరణలో కేసీఆర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan to tour telangana soon
Renuka chaudhary as rajya sabha member race  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles