Apsrtc plans to attract travellers

apsrtc plans to attract travellers, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

apsrtc-1.gif

Posted: 12/27/2011 11:45 AM IST
Apsrtc plans to attract travellers

apsrtc-buses2ప్రైవేటు సంస్థలతో పోటీ పడటానికి ఎపిఎస్ ఆర్ టి సి కసరత్తులు చేస్తోంది. ముందు వాటిని ఎదగనిచ్చి ఇప్పుడూ వాటిని అందుకోవటానికి ప్రయత్నం చెయ్యటం ఆశ్చర్యంగా ఉన్నా, ఇదీ ఒకందుకు మంచిదే అయిందేమో. లేకపోతే లక్ష్యం అంత పెద్ద ఎత్తున ఏర్పడేది కాదు. లాభాలు బాగా గడిస్తున్నందువలనే కదా ప్రైవేటు బస్సులు అంతగా పెరిగిపోయాయి. మరి ఆర్టిసి కి నష్టాలెందుకు వస్తున్నాయి అంటే యాజమాన్యపు ఖర్చులు ఎక్కువ, సేవల్లో నాణ్యత తక్కువవటమే కారణం.   బస్సులను రిపేర్లు, మెయింటెనెన్స్ లను శాస్త్రోక్తంగా చూడటంతోపాటు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా బస్సు స్టాండ్ లను తీర్చిదిద్దటం, లాభాలు లేని రూట్లల్లో కూడా ప్రజా ప్రయోజనం దృష్ట్యా బస్సులను నడపటం వీటి వలన నష్టాలు వస్తున్నాయి.

నష్టాలను అధిగమించటానికి, ప్రయాణీకుల సంఖ్యను పెంచుకోవటానికి ఆకర్ష కార్యక్రమాలను చేపడుతోంది కానీ, ప్రయాణీకులు ఇంకా పెరిగితే సేవలను సజావుగా అందించగలరా అన్నది ప్రశ్న. ప్రైవేటు బస్సులతో పోటీగా వేగాన్ని పెంచుతూ, బైపాస్ రోడ్లను ఉపయోగిస్తూ ప్రయాణీకులను త్వరితగతిలో లక్ష్యాలకు చేరవేయటానికి పథకాలను ఆలోచిస్తోంది. కాగితం మీద ప్లాన్లు వెయ్యటం వరకూ బాగానే జరుగుతోంది కానీ అమలుచెయ్యటంలోనే కుంటుపడుతోంది. ఎక్కడిదాకో అక్కరలేదు. ప్రైవేటు బస్సులతో పోటీపడుతూ, మేము కూడా మా ప్రయాణీకులను అలరించగలం అని బస్సుల్లో ఏర్పాటు చేసిన సిడి ప్లేయర్లనే చూస్తే అవి పని చెయ్యక అలంకారప్రాయంగా ఉండటం గమనించవచ్చు. అది పని చెయ్యటం లేదంటే సకాలంలో అంత చిన్నదాన్నే సరిచెయ్యలేనివారు మిగతా విషయాల్లో పోటీ ఎలా పడగలరు. బస్సుస్టాండ్ లు, వసతులు లేకపోయినా ట్రావెలర్స్ ఆఫీసు ముందు వరండాలోనైనా బస్సు కోసం వేచి చూస్తూ ప్రైవేటు బస్సులను ఎక్కుతున్నారంటే దానికి కారణాలనన్నిటినీ అధ్యయనం చేస్తేనే ఆర్టీసీ పోటీ పడగలుగుతుంది.

నిజానికి ప్రభుత్వం అండదండలున్న ఆర్ టి సి, ప్రైవేటు రంగానికే పెద్ద పోటీ ఇవ్వాల్సింది పోయి, ప్రైవేటు రంగ సేవలను అనుకరించే ప్రయత్నం చెయ్యటం శోచనీయం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  100 years to original verse of national anthem
Discussions in parliament and deeksha at mumbai for lokpal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles