సామాజిక వేత్త, అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా లోక్ పాల్ బిల్లు కోసం నడుం బిగించిన అన్నా హజారే ప్రధానమంత్రికి, ఎంపీలందరికీ 27 నుంచి తాను చెయ్యదలచుకున్న దీక్షకు ముందుగా మరో లేఖను పంపించారు. సిబిఐ ని లోక్ పాల్ లోకి చేర్చవలసిందేనంటూ పట్టుబడుతూ, లోక్ పాల్ కి సుమోటో అధికారాలుండాలని ఆయన తెలియజేసారు. అంతేకాకుండా నిందితుడు అన్నీ సర్దుకునేందుకు అవకాశమిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యటం, ప్రాథమిక విచారణకు ఆదేశించటంలాంటివేమీ ఉండగూడదని, ప్రభుత్వోద్యోగుల్లో సి, డి కేటెగరీ లోని ఉద్యోగులను నేరుగా విచారణ చేసే అవకాశముండాలని ఆయన సూచించారు.
అంతేకాకుండా లోక్ పాల్ నియామక విధానాన్ని కూడా బిల్లులో స్పష్టంగా సూచించాలని ఆయన అన్నారు. ప్రధానమంత్రి, ప్రతిపక్షనాయకుడు, సుప్రీంకోర్టు ఎంపిక చేసిన ఇద్దరు జడ్జీలు, కాగ్, కేంద్రవిజిలెన్స్, ఎన్నికల కమిషనర్ తో కూడిన కమిటీ లోక్ పాల్ ని నియమించ వలసి వుంటుందని చెప్తూ అన్నా హజారే, ఈ విషయాన్ని ఇప్పుడే స్పష్టంగా బిల్లులో పేర్కొంటూ దాన్ని చర్చలోకి తీసుకుని రావాలని ఆ లేఖలో రాసారు.
డిసెంబరు 27 నుంచి వరుసగా మూడు రోజులు దీక్ష చేసిన అనంతరం అన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాసాల దగ్గర ఆందోళన సాగిస్తానని, జైల్ భరో కార్యక్రమంలో తను ముందుండి నడిపిస్తానని కూడా ఆయన తన లేఖలో మరోసారి హెచ్చరించారు.
అయితే, అన్నా ఆర్ఎస్ఎస్ ఏజెంటని కొత్తగా కాంగ్రెస్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న దిగ్విజయ్ సింగ్ ఆరోపిస్తూ, అందుకు సాక్ష్యాధారాలుగా ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. 1983లో ఆయన ఆర్ఎస్ఎస్ లో కార్యదర్శిగా పనిచేసారని, గోండా ప్రాంతంలో శిక్షణ కూడా తీసుకున్నారని దిగ్విజయ్ సింగ్ ఆరోపణ. అయితే దానివలన అన్నా అవినీతిని ఎదుర్కోవటానికి ఏవిధంగా అనర్హులో ఆయన చెప్పలేదు. పాతనేరచరిత ఉన్నవాడు కోర్టులో సాక్ష్యానికి పనికిరాడని ఇంపీచ్ చేసినట్టు అవినీతి గురించి కదమెత్తటానికి అన్నా అనర్హుడని చెప్పటానికి దిగ్విజయ్ ప్రయత్నం చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more