ప్రత్యేక విమానంలో నిన్న తిరుపతికి వెళ్ళిన విదేశాంగ శాఖామాత్యులు ఎస్ఎమ్ కృష్ణ ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. నిన్న తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, భగవద్గీత గౌరవానికి భంగమేమీ రాదని, రష్యా లోని న్యాయస్థానం సానుకూలమైన తీర్పు ఇస్తుందని ఆయన అన్నారు.
రష్యా తీర్పు ఇస్తే కానీ మనకు భగవద్గీత సంగతి తెలియదా? అయినా వ్యాసమహర్షి రాసిన భగవద్గీత గురించి వారేమీ మాట్లాడటం లేదు. స్వదేశీ అనువాదాల మీద ఎటువంటి వ్యాఖ్యానాలు చెయ్యటం లేదు. ఇస్కాన్ సంస్థాపకుడు స్వామి ప్రభుపాద చేసిన గీత వ్యాఖ్యానాలలో కొన్ని అంశాలను వారు తప్పు పట్టారు. హిందూత్వాన్ని అమెరికాలో నెలకొల్పిన ప్రభుపాద ఇంగ్లీషులో రాసిన గీతా తాత్పర్యాలకు రష్యన్ అనువాదం చూసిన కొందరు రష్యన్ వాసులు తెలిపిన అభ్యంతరమది. 700 శ్లోకాలున్న భగవద్గీతను ముద్రిస్తే 100 పేజీలకు ఎక్కువ కాదు. కానీ ప్రభుపాద రచన చిన్న ప్రింటులో రెండు వాల్యూమ్ లుగా 1200 పేజీలకు సాగింది. ఒక్కో శ్లోకానికి కొన్ని సందర్భాల్లో 8 పేజీల వ్యాఖ్య కూడా అందులో కనపడుతుంది. ఆ వ్యాఖ్యానాలను అనువాదకులు ఎలా అర్థం చేసుకున్నారో, వారు రాసిన దాన్ని పాఠకులు ఎలా తీసుకున్నారో తెలియదు. ఇస్కాన్ సభ్యులు అక్కడ నిరసనలు తెలిపారంటే కాస్త అర్థముంది. వారి గురువు గారు రచించిన గ్రంధాన్ని బహిష్కరిస్తున్నారని తెలిసి ఆవేదన చెందటాన్ని అర్థం చేసుకోవచ్చు.
పూరాణేతిహాసాలు, రాసిన ప్రాంతాన్నిబట్టి, అక్కడి మానవ జీవన శైలిని బట్టి ఉంటాయి. భారతదేశానికి చెందిన ఈ గ్రంథానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని కోరుకోవటమెందుకో అర్థం కాదు. ఏ దేశానికైనా అందులో అభ్యంతరాలుంటే దాన్ని తెలియజేసుకునే హక్కు వారికి లేదా. అయినా మనదేశంలో ఈ విషయంలో మనస్తాపం చెందుతున్నవారికి స్పష్టత లేదు. స్వామి ప్రభుపాద వ్యాఖ్యానాలను సమర్థిస్తున్నారా, రష్యన్ అనువాదకుల అవగాహనను శంకిస్తున్నారా అన్నది తెలియదు.
మన దేశంలో హిందువులకు భగవద్గీత పవిత్ర గ్రంథమే. కానీ ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారు? ఎంతమందికి కనీసం ఒక శ్లోకమైనా వచ్చు? ఎంతమంది కనీసం ఒక శ్లోకాన్నైనా అర్థం చేసుకుని వారి జీవితంలో అన్వయించుకున్నారు? మనకే సరిగ్గా తెలియని గ్రంథం, మరో దేశం వారు పఠించి అందులో తప్పులు వెతికారంటే వారు చేసిన పరిశోధనకు మనం గర్వపడాలి! కనపరచిన ఆసక్తికి వారిని అభిందించాలి! వాళ్ళు అందులో ఏదైనా పొరపాటుగా అర్థం చేసుకున్నారని తెలిస్తే, వీలయితే వారికి వివరణనివ్వవచ్చు! అప్పటికీ వారు దానికి అంగీకరించకపోయినా భగవద్గీతకున్న గౌరవం మంటకలిసినట్టు కాదు.
రష్యన్ దేశస్తుల నిషేధాభియోగాల వలన మనకు మన పవిత్ర గ్రంథం గుర్తుకొచ్చింది. అందుకు సంతోషం. ఇప్పటికైనా వారికి ఎక్కడ అభ్యంతరం కనిపించిందో తెలుసుకుంటే మనం కూడా దానిమీద శోధించి ఆ తప్పు ప్రభుపాద వలన దొర్లిందా లేకపోతే అనువాదకుల అవగాహనా లోపమా అన్నదిఅర్థం చేసుకోవచ్చు.
భగవద్గీతలో కులాచారాల ప్రస్తావన ఉంది. కులం పేరుతో ఒకరిని తిట్టగూడదు, వివక్ష చూపగూడదు అని మనదేశంలో ప్రతిపాదన ఉన్నప్పుడు, చట్టమే చేసినప్పుడు భగవద్గీతలోని ఆ అంశాన్ని మనం ధిక్కరించినట్టే కదా! ఇదే మాట మరో దేశం చెప్తే మనల్ని అవమానపరచినట్టా?
భారతదేశవాసులు సాధ్యమైనంత వరకూ ఎవరినీ నొప్పించకుండా ఉండాలనే చూస్తారు. బయటకు అందంగా కనిపించే ప్రయత్నమే చేసినా, మన ముఖం ఎదుటివారికి నచ్చలేదంటే దానికి మనమేమీ చెయ్యలేం. అది వాళ్ళ ఖర్మ! భగవద్గీతలోని కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవారు, ఎవరో మన గ్రంథాన్ని అగౌరవపరచారనే బాధకు లోనవరు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more