ఎనిమిది మంది సభ్యలతో తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయ వ్యవహారాలను సమీకరించి ఏఐసిసికి నివేదికను పంపించే కార్యాన్ని చక్కబెడుతూ వస్తున్న గులామ్ నబీ ఆజాద్ నేతృత్వంలో తయారైన ఈ కమిటీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, చిరంజీవి, మాజీ పిసిసి అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, ఎంపీ కావూరి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు సభ్యులుగా పనిచేస్తారు.
అంతకు ముందు 2010లో ఏర్పడ్డ కమిటీలోని మంత్రులు గీతారెడ్డి, జానారెడ్డి, కెవిపి రామచంద్రరావులు ఈ కమిటీలో తొలగించబడ్డారు. వారి స్థానంలో కొత్తగా చిరంజీవి, బొత్సా, దామోదర రాజనరసింహ వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి స్థానంలో కొత్త కమిటీలో ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉన్నారు. పాత కమిటీలో వైయస్ జగన్ కూడా ఉండేవారు. ఆ స్థానం లో ఎవరూ లేరు. అందువలన పాత కమిటీలోని 8 మంది కమిటీ సంఖ్య ఇప్పుడు 7కి మారింది. మరో వ్యత్యాసమేమిటంటే, పాత కమిటీలోన 8 మంది సభ్యుల్లో నలుగురు సభ్యులు తెలంగాణా నుంచి ఉంటే, ఇప్పుడు అది మూడుకి తగ్గింది.
2004లో రాబోయే సాధారణ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఏఐసిసి చేస్తున్న కసరత్తులో ఇది కూడా భాగంగానే కనపిస్తోంది. పార్టీలో విభేదాలు అంతరించి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికీ మధ్య తలెత్తుతున్న శీతల యుద్ధ సంకేతాలు రూపుమాసిపోవటానికి, విలీన ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవికి సముచిత స్థానం, ప్రాధాన్యతలను ఏర్పరచటానికి ఈ మార్పులు జరిగినట్టుగా కనిపిస్తోంది. సమిష్టి బాధ్యతలను భుజాల మీద వెయ్యటం వలన కలిసి పనిచేసే అవసరం ఏర్పడి, తద్వారా ముందు వీరిలో సమన్వయం ఏర్పడుతుందని, ఆ తర్వాత రాష్ట్ర వ్యవహారాలను వీరి ద్వారా సమీక్షిస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలను తీసుకుంటూ పార్టీ విధానాలను రూపొందించుకుంటూ పోవచ్చని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భావించి ఈ రకమైన ఏర్పాటు చేసినట్టుగా పార్టీ వర్గాల నుండి సమాచారం.
తలా ఒక దారైన ఈ కమిటీ సభ్యులు ఎలా కలిసి పనిచెయ్యగలరనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. కానీ, ఎవరికి వారు విడివిడిగా ఇస్తున్న నివేదికలనుబట్టి వారి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, అవగాహనలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యే ఉంటాయి. కమిటీని ఏర్పాటు చేసే ముందు వాటిని దృష్టిలో పెట్టుకునేవుంటారు. చిరంజీవిని పార్టీలో ఉంచుకోవటం వలన జరిగిన లాభమేమిటో అవిశ్వాస తీర్మానంలో తెలియనే తెలిసింది. అటువంటి వ్యక్తిని అసంతృప్తికి గురిచెయ్యటం, పోగొట్టుకోవటం ఇష్టంలోని ఎఐసిసి, మంత్రివర్గ విస్తరణకు ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈ లోపులో, రాజకీయాల్లో తనకి అప్పజెప్పిన పనిని చిత్తశుద్ధితో ఆచరించే చిరంజీవికి సమన్వయ కమిటిలో చోటిచ్చింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమైన పదవి లేదని ఆందోళన చెందుతున్న వైయస్ జగన్ కి కూడా ఇలాగే సమన్వయ కమిటీలో చోటివ్వటం జరిగింది. కానీ జగన్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచెయ్యటం మొదలుపెట్టి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ సమన్వయ కమిటీ ఆ తర్వాత ఏ కారణాల వల్లనో నిస్తేజమైపోయింది.
ఈసారైనా ఈ కొత్త కమిటీ రాష్ట్ర వ్యవహారాలను ప్రాదేశికంగా ఎప్పిటికప్పుడు సమీకరిస్తూ కేంద్ర స్థాయిలో పార్టీ వ్యవహారాలను సమీక్షించటానికి ఉపయోగపడుతుందని ఎఐసిసి భావిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more