Kvp ramachandra rao

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

KVP Ramachandra rao.GIF

Posted: 12/23/2011 10:08 AM IST
Kvp ramachandra rao

KVP-Ramchandraraoవైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన అనుంగ మిత్రడుడైన కేపీవీ రామచంద్రరావు ముఖ్యమంత్రి తరువాత స్థానం నాదే అనేట్లుగా వ్యవహరించేవాడు. ఒకప్పుడు ఆయన మాట శిలాశాసనం. ముఖ్యమంత్రి కాకపోయినా ఆయన ఆత్మబంధువు కావడంతో ఆ స్థాయిలో ఆయన హవా నిర్నిరోధం గా సాగింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ నుంచి మంత్రుల వరకూ ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. బదిలీలు, పదోన్నతులు... ఒకటేమిటి? ప్రభుత్వంలో ఏ ఫైలు కదలాలన్నా, బిల్లులు మంజూరు కావాలన్నా, ఆగిపోవాలన్నా, కార్పొరేషన్‌ పదవులు రావాలన్నా, ఆగాలన్నా, ఎంపీ- ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నా- రాకూడదనుకున్నా ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు కావలసిందే. అప్పుడు అధిష్ఠానం వద్ద కావలసినంత పలుకుబడి. ఆత్మబంధువు పక్షాన హస్తినలో ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేంత పలుకుబడి. అధిష్ఠానం అవసరాలను మిత్రుడి ద్వారా నెరవేర్చిన కార్యదక్షుడు.  మరి అంతటి వాడికి కాలం ఇప్పుడు కాలం కలిసి రావడంలేదు. వైయస్సార్ మరణించిన తరువాత  ఇతనికి అంతంత మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు కాంగ్రెస్ వారు.  ఆయన ఊసు లేకుండానే అన్నీ జరిగి పోతున్నాయి. ఆయనను పట్టించుకునే దిక్కులేదు. కనీసం ఇతను ఎదురవుతే పలకరించే వారు లేరు. చివరకు అధిష్ఠానం కూడా పక్కనపెట్టింది.

కాంగ్రెస్ కి  కీలకమైన సమన్వయ కమిటీలో చోటులేకుండా చేసింది. కాంగ్రెస్‌ నాయకత్వం తాజాగా ప్రకటించిన సమన్వయ కమిటీలో కేవీపీకి స్థానం లేకుండా చేయటంతో ఆయన పలుకుబడి పలచబడిందని, నాయకత్వం ఆయనను పక్కకుపెట్టిందన్న సంకేతా లు కిందిస్థాయి వరకూ వెళ్లాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishna reddy statement about revival of party
Food security bill 2011 details  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles