ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ ఆహార సరఫరా విధానం ప్రకారం, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నకుటంబాలకు నెలకు 35 కిలోల బియ్యం, లేక గోధుమలను రూ.5.65, రూ.4.14 కి ఇస్తోంది. దారిద్ర్య రేఖకు ఎగువున ఉన్నవారు బియ్యం లేక గోధుమలను రూ.8.30, 6.10 కి పొందుతున్నారు.
ఈరోజు పార్లమెంటులో ఆహార భద్రతా చట్టానికి సంబంధించిన బిల్లును కేంద్ర ఆహార మంత్రి కెవి థామస్ ప్రవేశపెట్టగా సర్వసమ్మతితో చర్చలు లేకుండానే స్వీకరించబడింది.
ఏమీటీ ఆహార భద్రత. ప్రభుత్వం సగర్వంగా ప్రవేశపెట్టిన ఆ బిల్లు వలన ఎవరికి ఏం లాభముంటుంది. తమిళనాడు, బీహారు ప్రభుత్వాలు వారి రాష్ట్రాల్లో దీన్ని వర్తింపజేయకుండా మినహాయించమని ఎందుకు అంటున్నారు.
దేశ ప్రజల్లో 63.5 శాతం మందికి ఆహార భద్రతకు హామీ ఇస్తూ, వారు సగౌరవంగా జీవించటానికి మంచి ఆహారం, పౌష్టికమైన ఆహారం, సరిపడినంత ఆహరానికి హామీ ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన బాధ్యతగా థామస్ వివరించారు.
అంతవరకూ బాగానే వుంది కానీ దానితోపాటు ఇచ్చిన రాజకీయ వివరాలు ఈ బిల్లు ఔచిత్యాన్ని తక్కువ చేసేస్తున్నాయి. 2009 లో ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని పూర్తి చేస్తోందని గుర్తు చెయ్యటం వచ్చే ఎన్నికలకు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. సోనియా గాంధీ వరంలా ముద్ర వేసుకున్న ఈ బిల్లు ప్రకారం, గ్రామీణ ప్రాంతంలో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం కుటుంబాలకు ఇది మేలు చేస్తుంది. లబ్ధిదారులకు మనిషికి నెలకి 7 కిలోల ఆహార ధాన్యం, ఒక కిలో పప్పు ధాన్యాలు సమకూర్చుతారు. బియ్యమైతే కిలో 3 రూపాయలకు, గోధుమలు తీసుకునేవారికి కిలో 2 రూపాయలు, పప్పు ధాన్యాలు కిలో 1 రూపాయకు సరఫరా చేస్తారు. మిగతా కుటుంబాలలో తలకి 3 కిలోల ఆహారధాన్యాలను సగం మద్దతుతో అందిస్తారు.
14 సంవత్సరాల లోపు బాలబాలికలకు మధ్యాహ్న భోజన పథకం, గర్భిణీ స్త్రీలకు, తల్లి పాలను ఇచ్చే బాలింతలకు నెలకు రూ. 6000 ఇవ్వటమనేది కూడా ఈ బిల్లు ప్రకారం చట్టబద్ధమౌతుంది.
ఈ బిల్లుని అమలులోకి రావటానికి ప్రభుత్వం 95000 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది ఎక్కడినుంచి తెస్తారన్నదానిలో స్పష్టత లేదు. కానీ సెప్టెంబర్ నుంచే ఈ బిల్లు మీద ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతను మంత్రి వర్గం, సోనియా గాంధీ అధ్యక్షతన జాతీయ సలహా సంఘం, సి.రంగరాజన్ అధ్యక్షతన ప్రధాన మంత్రి ఆర్థిక సలహా సంఘం అధ్యయనం చేస్తూ చర్చలు జరుపుతూనేవుంది. దీనితో పాటు సెప్టెంబర్ లోనే ఆహార మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఈ బిల్లు ని పెట్టి ప్రజాభిప్రాయాన్ని కోరింది. వీటన్నిటినీ సమీకరించి చివరకు క్యాబినెట్ లో ప్రవేశపెట్టటం జరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఈ బిల్లు సందిగ్ధాలతో కూడుకుని అర్థం లేకుండా ఉందని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కిలో రూపాయికి బియ్యం ఇస్తుంటే మీరు 3 రూపాయలకు ఇస్తాననటంలో అర్థం లేదని అన్నారు. అందుకు సమాధానంగా, ఈ చట్టాన్ని ఇంకా అందరూ సరిగ్గా అర్థం చేసుకోలేదని, అందరికీ అనుకూలమైన రీతిలోనే అమలు చేసే కార్యక్రమం ఉంటుందని అన్నారు.
ఈ చట్టంలో బాలల, స్త్రీ ల సంరక్షణా పథకాలను కూడా కలిపివేస్తున్నారు కాబట్టి సంవత్సరానికి 20000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ భారం పడదని థామస్ అంటున్నారు. అన్నిటికంటే ముందు ఆహార సరఫరా యంత్రాంగాన్ని ఆధునీకరించాలని, దానితోపాటు ఆహార నిల్వలను కాపాడుకునే ఏర్పాట్లను పెంచుకోవాలని అన్నారు. ఏప్రిల్ నుంచి ఆహార సరఫరా విభాగాన్ని 4000 కోట్ల రూపాయల ఖర్చుతో కంప్యూటర్లతో ఆధునీకరణ చేపడుతున్నామని, అందుకు ప్లానింగ్ కమిషన్ ఈ సొమ్ముని దీనికోసం కేటాయించటం కూడా జరిగిందని అన్నారు.
రాజకీయ లబ్ధి, ఇది సోనియా గాంధీ మానస పుత్రిక అన్న విషయాలను పక్కన పెడితే, ఆహార భద్రత అనేది పేదరిక నిర్మూలనకే కాకుండా, నిజంగానే జాతి సగౌరవంగా జీవించటానికి తోడ్పడుతుంది. ఆకలి చావులు, పేదరికం వలన ఆత్మహత్యలు, జాతి గౌరవాన్ని మంటగలపటమే కాకుండా, మానవ జాతి అవమానంతో తలదించుకోవలసిన విషయాలు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం. కాకపోతే మనదేశంలో అమలు పరచటంలోనే వస్తుంది తంటా అంతా. లబ్ధిదారులను గుర్తించటంలోనూ పక్కదార్లు పట్టకుండా చూసుకోవటం లోనే ఉంటుంది ప్రయాసంతా. ఇందులో కూడా అవినీతి అక్రమాలు చోటుచేసుకోవటం, మరో కుంభకోణానికి తెరతీయటం జరగకపోతే మాత్రం ఈ చట్టం వలన దేశ ప్రజలకు నిజంగా ఎంతో మేలు జరుగుతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more