Cm kirankumar reddy prooves strength

CM Kirankumar Reddy prooved its strength in Assembly today.kirankmar reddy, assembly, chandrababu naidu, no confidence motion, tdp, prp, ysr party, trs, bjp, cpm, cpi, loksatta, prp, congress.

CM Kirankumar Reddy prooved its strength in Assembly today.kirankmar reddy, assembly, chandrababu naidu, no confidence motion, tdp, prp, ysr party, trs, bjp, cpm, cpi, loksatta, prp, congress.

CM Kirankumar Reddy prooves strength.GIF

Posted: 12/06/2011 09:49 AM IST
Cm kirankumar reddy prooves strength

Kiran-kumar-reddyప్రతిపక్షం పార్టీ తెలుగు దేశం పెట్టిన అవిశ్వాసం అర్థరాత్రి వీగిపోయింది. అవిశ్వాసంలో అసలు విషయం తేలిపోయింది. ముందే ఫలితం తెలిసిన పరీక్షలో కిరణ్ కుమార్ రెడ్డి గెలుపోందారు. ఇన్ని రోజులు భీరాలు పలుకుతూ ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు పై సవాలు విసిరిన జగన్ తనకు బలం లేదని నిరూపించుకున్నాడు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 160 ఓట్లు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. తెలుగుదేశం సభ్యులు 85 మంది, టిఆర్ఎస్ సభ్యులు 11 మంది, సిపిఐ సభ్యులు నలుగురు, బిజెపి సభ్యులు ఇద్దరు, సిపిఎం సభ్యుడు ఒకరు, స్వతంత్ర సభ్యుడు ఒకరు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. ఒకరు తటస్థంగా ఉండగా, ముగ్గురు సభకు గైర్హాజరయ్యారు. గైర్జారైనవారిలో ఒకరు టిఆర్ఎస్ సభ్యుడు, ఒక మజ్లీస్ సభ్యుడు, జగన్ వర్గం ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడానికి 143 ఓట్లు అవసరం కాగా, 161 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజారిటీ కన్నా ప్రభుత్వానికి 17 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ప్రభుత్వానికి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 17 మంది, మజ్లీస్ సభ్యులు ఆరుగురు మద్దతిచ్చారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటా 10 నిమిషాల సమయంలో ఓటింగ్ జరిగింది. జయసుధ ప్రభుత్వానికి మద్దతు పలికారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించిన తర్వాత స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.

దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాసానికి అనుకూలంగా 122 ఓట్లు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన 18 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అవిశ్వాసానికి మద్దతిచ్చారు. పూతలపట్టి రవి ఓటింగుకు గైర్హాజరయ్యారు. ఓటింగు జరగడానికి ముందు ఆయన సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 122 మంది సభ్యులు ఓటేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏకైక శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood star aamir khan father again
Leaves without pay  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles