Daily building workers

daily building workers, Building Workers, Labours, Painting worker, some people, different work,

daily building workers

daily building workers1.GIF

Posted: 12/01/2011 03:40 PM IST
Daily building workers

daily building workers

పొట్టకూటి కోసం  ఉదయం లేచింది మొదలు భార్య పిల్లలతో పొద్దస్తమానం  గొడ్డుచాకిరీ చేసిన  భవన నిర్మాణ కార్మికులకు దక్కే ప్రతిఫలం  మాత్రం శూన్యం  వీరిని  పనిలోకి తీసుకొనేది  మేస్ర్తీలే అక్కడ వారిదే రాజ్యం.  వారు చెప్పినట్టు వినడం ఇస్తామన్న కూలికి ఒప్పుకోవడం తప్ప  మరో మాట  మాట్టాడకూడదు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా  కార్మికులున్నది భవన  నిర్మాణ రంగంలోనే. ఈ రంగంలో సుమారు 50 లక్షల  కార్మికులున్నారు.

worker2తాపీ పని, మట్టి పని, ప్లంబింగ్‌, రాడ్‌ వైండింగ్‌, కరెంట్‌ పని, రాళ్ళు కొట్టడం, మోయడం, ఇటుక బట్టిలో పని చేయడం ఇటుకలు మోయడం, పెంకులు చేయడం, మార్బుల్‌ ఆతికించడం తదితర 28 రకాల వృత్తుల్లో కార్మి కులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో అసంఘటిత రంగంలో కోటిమంది ఉన్నారని అధికార గణాంకాలే చెబుతుండగా వారిలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులే కావడం గమనార్హం.అతి వృష్టి అనా వృష్టితో అప్పుల పాలైన చిన్న సన్న కారు రైతు కుటుంబాలు కూడా నేడు నిర్మాణ రంగంలో చాలీచాలని కూలీతో దుర్భమైన జివితాలు గడుపుతున్నారు. రోజు రోజుకు నూతన భవన నిర్మాణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూలీల వేతనాలు మాత్రం ఏ మాత్రం పెంచడంలేదు. కూలీ చెల్లింపు విషయంలో మేస్త్రీలదే పెత్తనం. వారు ఇచ్చినంతే తీసుకోవాలి భవన నిర్మాణ కూలీలను కదిలిస్తే వారి బాధలు గాధలు ఇన్ని అన్ని కావు. బయటకి కనిపించని ఎన్నో చేదు అనుభవాలు హృదయాన్ని కదిలిస్తున్నాయి.

daily building workersపలక బలపం పట్టాల్సిన చిన్నారులు ఇసుకను, ఇటుకలను మోస్తున్నారు. పట్టణాల్లో నిర్మాణ కూలీల సంఖ్య గణనీయంగా పెరిగిపోగా వారిలో ఎక్కువ శాతం స్త్రీలు, పిల్లలు అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టాలు రూపొందించడంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల కార్మికులు విపరీతమైన దోపిడీకి గురవుతున్నారు. ఒక సారీ భవన నిర్మాణ కూలీలుగా మారిపోతే ఇక జన్మలో ఆ వృత్తి నుంచి బయట పడడం సాధ్యం కాదు. ఈ మధ్యకాలంలో ఇళ్ళ నిర్మాణాలకు వాడే వస్తువుల ధరలు విపరీతంగా పెరగ డంతో నిర్మాణాలు కొంత తగ్గాయి. దీంతో కూలీల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నెలలో పని దొరికేది 10 రోజులేనని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

daily building workersగ్రామీణ కూలీలు పనికోసం వలసలు పోకుండా ఊళ్ళల్లోనే పని కల్పించాలనే ఉద్దేశంతో ఫ్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినా కూలీలకు మాత్రం ప్రయోజనం కలగడం లేదు. ఉపాధి హామీ పనులు గ్రామాలలో జరగడం లేదని పలువురు వాపోతున్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 1996లో పార్లమెంట్‌ ఆమోదంతో రూపొందించిన భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని అమలు పర్చడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

worker5భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదం జరిగితే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా కార్మికులం దరికీ రేషన్‌ కార్డులు, గృహవసతి, ప్రసూతి, వైద్య సౌకర్యం, బీమా, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nc motion doubtful in this assembly session
Peruvian gold mine suspended  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles