Peruvian gold mine suspended

Construction of Peruvian gold mine suspended, gold mining project called Conga, gold mining, America, Lima, Peru, $4.8 billion gold mining project called Conga

Construction of Peruvian gold mine suspended

gold mining.GIF

Posted: 12/01/2011 03:20 PM IST
Peruvian gold mine suspended

Peruvian gold mine suspended

పెరూలో అనేక రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో తాను ఉత్తర పెరూలో నిర్మించతలపెట్టిన ఓపెన్‌కాస్ట్‌ బంగారు గని నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా కంపెనీ న్యూమోంట్‌ తెలిపింది. ఆండెస్‌లోని ఆ గని ప్రదేశంలో కనీసం పది మంది గాయపడ్డారు. 480 కోట్ల డాలర్ల ఆ ప్రాజెక్టు కాలుష్యం కలిగిస్తుందని, నీటి సరఫరాలను నాశనం చేస్తుందని విమర్శకులు తెలిపారు. ఒక రాజీకి వచ్చే ప్రయత్నంలో భాగంగా తాను స్థానిక ప్రజలతోనూ, ప్రభుత్వంతోనూ సంప్రదింపులను పునరుద్ధరిస్తానని ఆ కంపెనీ వాగ్దానం చేసింది.

2015లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉన్న కోంగా ప్రాజెక్టుకు, లాటిన్‌ అమెరికాలోని అతి పెద్ద బంగారు గని యనకోచా విస్తరణ ప్రాజెక్టుకు కొలరాడోలోని డెన్వర్‌కు చెంది న్యూమోంట్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ మెజారిటీ భాగానికి యజమానిగా ఉంది. కజమార్కా ప్రాంతంలో ప్రశాంతత, సామాజిక శాంతిని తిరిగి నెలకొల్పే ఉద్దేశంతో ప్రాజెక్టు కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు న్యూమోంట్‌ నిర్వహిస్తున్న యనకోచా గని నుంచి, చిలీలోని స్థానిక భాగస్వామి బ్యూనావెంచురా నుంచి విడుదలైన ప్రకటన తెలిపింది.

సముద్ర మట్టానికి 3,700 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాజెక్టు పర్వతాల్లో ఉన్న నాలుగు సరస్సుల నుంచి ఈ కంపెనీ నిర్మించే రిజర్వాయర్లకు నీటిని చేర్చుతుంది. ఈ రిజర్వాయర్లు ఆ సరస్సులకు ప్రత్యామ్నాయంగా ఉండబోవని, అవి వ్యవసాయానికి భూగర్భ జలాలను, పశు వుల కోసం పచ్చిక మైదానాలు పెంచేందుకు నీటిని సరఫరా చేస్తాయని నిరసనకారులు వాదిస్తున్నారు. కజమార్కా పెరూలోని ప్రముఖ డెయిరీ, పశు సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతంగా ఉంది.;

ఈ గని నుంచి వెలువడే కాలుష్యం వల్ల వ్యవసాయం దెబ్బతింటుందని కార్యకర్తలు భయపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ ప్రభావాలపై అధ్యయనాలు బలహీనంగా, కాలం చెల్లిపోయినవిగా ఉన్నాయని, విశ్వసనీయత లోపించిందని పేర్కొంటూ పెరూ పర్యావరణ శాఖ ఉప మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.;

రాజకీయ నేతలు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెను ప్రారంభించారు. దేశ సహజ వనరులను అభివృద్ధి చేయడం ద్వారా పే ప్రజలకు ప్రయోజనం కల్పిస్తామని గత జూన్‌లో ఎన్నికైన అధ్యక్షుడు హుమాలా వాగ్దానం చేశారు. ఆయన పదవి చేపట్టినప్పటి నుంచీ మైనింగ్‌ కంపెనీలపై పన్నులు పెంచారు. తమ భూములపై చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక తెగలతో సంప్రదించాలంటూ వారికి హక్కు కల్పించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daily building workers
Sabbam hari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles