భారతదేశం ఎన్నో రాజవంశస్థుల ద్వారా పరిపాలించబడిన విషయం తెలిసిందే! ముఖ్యంగా ముస్లింల సామ్రాజ్యమే ఎక్కువగా పరిపాలించారు. చాలావరకు మగవారే సింహాసనాన్ని అధిష్టించారు. అయితే రజియా సుల్తానా మొట్టమొదటిసారిగా సింహాసనం అధిష్టించి మొదటి మహిళా చక్రవర్తిగా పేరుగాంచింది. కానీ.. సింహాసనం ఆమెకు అంత సులువుగా లభించలేదు. కుటుంబనేపథ్యంలో సింహాసనం విషయంలో కొన్ని అంతర్గతంగా విభేదాలు ఏర్పడ్డాయి. పైగా.. ఆమె అధిష్టించిన నేపథ్యంలో ఎన్నో వ్యతిరేకాలను చవిచూడాల్సి వచ్చింది. ఎన్నో సమస్యలు ఆమెకు అడ్డుపడినప్పటికీ వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు నడిచిన ఈమె.. మహిళా చక్రవర్తిగా చరిత్రలో చెరగని ప్రత్యేక ముద్రను వేసుకుంది.
జీవిత విశేషాలు :
భారతదేశాన్ని టర్కిష్ వంశస్థులు పరిపాలిస్తున్న నేపథ్యంలో ఆ సామ్రాజ్యానికి చెందిన చక్రవర్తి షంసుద్దీన్ అల్లమష్ కుమార్తె రజియా సుల్తానా! అతడు సింహాసనం నుంచి దిగిన అనంతరం అతని వారసురాలిగా ‘ఢిల్లీ సల్తనత్’ను 1236లో అధిష్టించింది. నిజానికి చారిత్రక కథనాల ప్రకారం.. చక్రవర్తి అల్తమష్ మొదట తన కుమారుణ్ణి పట్టాభిషిక్తుడు చేశాడు. అయితే అతడు కొన్నినెలలకే మరణించడంతో అతని స్థానంలో తన కుమార్తె రజినాయను సుల్తాన్’గా పేర్కొన్నాడు. కానీ ఒక మహిళను సుల్తాన్’గా ప్రకటించడం జీర్ణించుకోలేకపోయిన ఆమె అన్నయ్య రుక్నుద్దీన్ ఫిరోజ్’షా.. తనకే అధికారం దక్కాలని పన్నాగాలు పన్నాడు. అతడు అనుకున్నట్లుగానే తండ్రి అల్తమష్ మరణించిన అనంతరం తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అయితే రుక్నుద్దీన్ షా పరిపాలన కూడా కేవలం కొంతకాలం వరకే సాగింది.
రుక్నుద్దీన్ తన సామ్రాజ్యం పట్ల దృష్టి సారించకుండా మద్యపానానికి వ్యసనపరుడు కావడం వల్ల అతడు ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. అదే అదునుగా భావించిన అల్తమష్ భార్య షామ్ తుక్రాన్ తన కుమారుడ్ని సింహాసనంపై కూర్చోబెట్టి తానే అధికారాలు చెలాయించేది. వారి పాలనలో సామ్రాజ్యం ఎన్నో కష్టనష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే 1236 నవంబర్ 6వ తేదీన రుక్నుద్దీన్, షాహ్ తుక్రాన్ ఇద్దరూ వధించబడ్డారు. అలా ఇద్దరూ చనిపోవడంతో సింహాసనాన్ని ఎవరూ అధిష్టించాలోనన్న సంగ్దిద్ధత నెలకొంది. అప్పుడ అర్హతల దృష్ట్యా రజియా ఢిల్లీ సింహాసనాన్ని ప్రజల అనుమతి ద్వారా అధిష్టించింది. ఆమె చక్రవర్తిగా అధికారం చేబట్టినా.. ఒక అంత:పుర స్త్రీలలా కాకుండా సామాన్యప్రజల మధ్యలోనే వుండేది. వారి కష్టాలు, సమస్యలు అందరిమధ్య కూర్చునే చర్చించేది. ఒక రాణిలా కాకుండా సైనికునిలా తన బాధ్యతలు నిర్వహించేది.
రజియా విశేషాలు :
రజియా తన పరిపాలనాకాలంలో ముస్లిమేతరులపై పన్నులను తొలగించింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ముస్లిం ప్రతినిధులు ఆమెపై విరుచుకుపడ్డారు. అప్పుడు ఆమె ముస్లింల భావాలకన్నా ఇస్లాం సూత్రాలు ముఖ్యమనీ ముహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను ఉటంకించింది. ‘‘ముస్లిమేతరులపై భారాలను మోపకండి : ముహమ్మద్ ప్రవక్త’’ అనే సూత్రంతో ఆమె అందరిలో మార్పు తీసుకొచ్చింది. మరో సందర్భంలో రజియా, క్రొత్తగా ఇస్లాంను స్వీకరించిన ఒకరిని ఉన్నత స్థానంగల హోదానిచ్చింది. దీనినీ టర్కిష్ నోబుల్స్ వ్యతిరేకతను ప్రదర్శించారు. అయితే తన రాజ్యంపట్ల తన ప్రజలపట్ల అమిత శ్రద్ధాశక్తులు కలిగిన ఆమె.. రాజ్యానికి మేలుకోరే వారినే ఉన్నత హోదాల్లో కూర్చోబెట్టేదని స్పష్టం చేసింది.
ఇతర రాజులలాగా ప్రజలనుండి దూరంగా వుండకుండా వారిమధ్యే ఒకరిగా తిరుగుతూ వుండేది. హిందూమతావలంబీకుల పట్ల చూపించే అభిమానం పట్లనూ సమకాలీన ముస్లిం చరిత్రకారులు వ్యతిరేకత వ్యక్తపరిచారు. ఈమె పాఠశాలను, విద్యాసంస్థలను, పరిశోధనా కేంద్రాలను, ప్రజా-గ్రంధాలయాను స్థాపించింది. ఈ సంస్థలలో ప్రాచీన తత్వవేత్తల పై, ఖురాన్ పై, హదీసులపై పరిశోధనలు సాగేవి. హిందు ధర్మశాస్త్రాలు, తత్వము, ఖగోళశాస్త్రము, సాహిత్యమునూ ఈ పాఠశాలలు, కళాశాలలో అధ్యయనా విషయాలుగా వుండేవి. రజియాను ఎవరైనా ‘‘సుల్తానా’’ అని సంబోధిస్తే ఆమె నిరాకరించేది.
రజియా పరిపాలనా కాలం :
రాజతంత్రాలలో ఆరితేరిన రజియా... టర్కిష్ ప్రతినిథులను, సామంతులను అవలీలగా నిలువరించగలిగినది. తన వ్యతిరేక వర్గాలమధ్య వ్యతిరేకతను సృష్టించి తన సింహాసనాన్ని భద్రపరచుకో గలిగింది. అయితే తన సలహాదారులలో ఒకడైన జమాలుద్దీన్ యాకూత్, మరొక దాసుడు అబిసీనియన్’ల పరస్పర ఆకర్షణల వల్ల ఇతరుల ప్రతినిధుల కోపాన్ని చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆమె ఒక హబష్ (అబిసీనియన్) దాసుడికి రజియా దాసురాలు కావడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అప్పటినుంచి ఆమెపై వ్యతిరేకంగా కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. దానినే అదును భావించిన రజియా స్నేహితుడు, భటిండా గవర్నర్ మాలిక్ ఇక్తియారుద్దీన్ అల్తూనియా ఆ వ్యతిరకవర్గాలతో చేతులు కలిపి.. ఆమెపై యుద్ధానికి దిగాడు.
అప్పుడు రజియా, అల్తూనియాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రజియా ప్రేమికుడైన యాకూత్ చంపబడ్డాడు. యుద్ధంలో ఓడిన రజియా కూడా చెరసాల పరమయ్యింది. ఇక చేసేదేమీ లేక చివరకు ఆమె అల్తూనియాను వివాహమాడింది. వారిద్దరి వివాహం జరిగిన కొన్నికాలాల అనంతరం రజియా మరొక అన్నైన ముయిజుద్దీన్ బహ్రామ్ షాహ్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాలని పన్నాగం వేస్తాడు. అప్పుడతడు అల్తూనియాపై యుద్ధం ప్రకటిస్తాడు. అప్పుడు వాళ్ల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్దంలోనే అల్తూనియా, రజియా 1240 అక్టోబరు 24వ తేదీన తమ ప్రాణాలను కోల్పోయారు. దాంతో బహ్రామ్ ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more