Divya Sathyaraj on joining Obama supported organisation అక్షయపాత్రకు పోషకాలు అందించే తల్లి: దివ్య సత్యరాజ్

Akshaya patra foundation appoints nutritionist ms divya sathyaraj as goodwill ambassador

Divya Satyaraj, Nutrition, Akshaya Patra Foundation, goodwill ambassador, nutritionist, Research, village children, Hospitals, yashodara

The Akshaya Patra Foundation has appointed Ms. Divya Sathyaraj as its Goodwill Ambassador. With her staunch belief equating food to medicine, Ms. Sathyaraj has been working as a professional nutritionist.

పిల్లలందరికీ పోషకాహారం అందించే కల్పవల్లి: దివ్య సత్యరాజ్

Posted: 12/29/2018 04:45 PM IST
Akshaya patra foundation appoints nutritionist ms divya sathyaraj as goodwill ambassador

దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే అహారం గురించి తెలుసుకున్నారు. అదీ ఒక చదువే అని అశ్చర్యపోయే అనేక మంది గ్రామీణ ప్రజలు తీసుకునే పోషకాల లేమి ఉన్న అహారం.. వాటి వల్ల వారు ఎదుర్కోనే రోగాలను కూడా గుర్తించింది. వాటిపై పూర్తిగా అధ్యయనం చేశారు.

ఇంతకీ ఈమె ఎవరో కాదు బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్‌ తనయ. తండ్రి నటనారంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటే.. తనయ కూడా తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ‘పోషకాహారం’ పై ఉన్నతాభ్యాసంతోపాటు ఎన్నో పరిశోధనలూ చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన ‘అక్షయ పాత్ర ఫౌండేషన్‌’ తమ సంస్థకు ఆమెను గుడ్ విల్‌ అంబాసిడర్ గా నియమించింది. నిరుపేద చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే దిశగా తన వంతు కృషి చేస్తున్నారు.

న్యూట్రిషన్‌ కోర్సులో ఎంఫిల్ చదువుతన్న సమయంలో ప్రభుత్వాసుపత్రులు, పాఠశాలలకు వెళ్లారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి కూడా అక్కడ చిన్నారు తీసుకునే అహారాన్ని గమనించారు. వారి ఆహారంలో ఎలాంటి పోషకాలు వున్నాయి.? ఏమీ లేవు అన్న విషయాలపై కూలంకుషంగా అధ్యయనం చేశారు. దానివల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు ఏంటన్న వివరాలను కూడా సేకరించారు. వీటన్నింటినీ కలుపుతూ పరిశోధన చేశారామె.

అంతటితో ఆగకుండా తాను చేసిన అధ్యయనాల వివరాలన్నింటినీ ఒక నివేదికగా రూపోందించి వాటిని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రికి అందించారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు అందించే మధ్యాహ్న బోజనంలో ఎటువంటి పోషక విలువలు తగ్గుతున్నాయో గుర్తించిన అమె.. ఆ వివరాలన్నీంటినీ కూడా అరోగ్యశాఖ మంత్రికి అందించారు. విద్యార్థులకు, ప్రభుత్వాసుపత్రుల రోగులకు ఆహార విషయంలో, శుభ్రతలో తగిన సౌకర్యాలను అందించడం అవసరం కాబట్టి, దాన్నే ఓ ప్రాజెక్టుగా చేపట్టారు.

అమె చేపడుతున్న అధ్యయనాలను పరిశీలించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌ అమె సేవలను ప్రశంసించింది. అంతటితో అగకుండా అమెను తమ సంస్థ ‘గుడ్‌విల్‌ అంబాసిడర్‌’గా నియమించింది. ప్రపంచవ్యాప్తంగా నిరుపేద, ప్రభుత్వ పాఠశాల చిన్నారులకు మధ్యాహ్న భోజన అందించే సంస్థలో అమె తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఈ సంస్థ అందించే ఆహారంలో ఇంకా చేర్చాల్సిన పదార్థాలు, పోషకాల గురించి అమె సలహాలు ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉండే చిన్నారుల ఆరోగ్యం, వారిలోని పోషకాహారలేమిని గుర్తిస్తూ.. అక్కడి ప్రాంతాల పిల్లలకు అందించే అహారంలో మార్పులు తీసుకువస్తున్నారు. తండ్రి చాటు తనయగా కన్నా తండ్రిని తగిన తనయగా అమె అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles