నిత్యం ఆఫీసు కార్యకలాపాలతోపాటు ఇంటి పనుల్లో నిమగ్నమైపోవడం, వాతావరణ కాలుష్య ప్రభావాల కారణంగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. తలనొప్పి, తీవ్ర మానసిక ఒత్తిడి, కడుపునొప్పి, ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ఇబ్బందులతోపాటు సౌందర్యపరంగా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నింటిని అధిగమించాలంటే.. ఇతరత్ర మందులు వాడాల్సిన అవసరం లేదు. సహజంగానే కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఆసమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
* మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారు జాజినూనెని వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనె గుండె పని తీరును కూడా పెంచుతుంది.
* ఒంటి నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెతో జాజినూనె కలిపి రాసుకుంటే నొప్పులు త్వరితంగా తగ్గుముఖం పడతాయని అంటున్నారు.
* బకెట్ నీళ్లలో కొద్దిగా జాజినూనెను కలిపి బాలింతలు స్నానం చేస్తే. చక్కగా నిద్రపడుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి.
* నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారు జాజినూనెను పొత్తి కడుపు మీద రాస్తే మంచి ఫలితం వుంటుందని సూచిస్తున్నారు.
* తల్లో పేలు బాధిస్తుంటే.. కొబ్బరినూనెలో జాజితైలాన్ని కలిపి రాస్తుంటే ఇబ్బంది ఉండదు. కేశాలు ఎంతో ఆరోగ్యంగా తయారవుతాయి.
* చెంచా పాలమీగడలో నాలుగు చుక్కలు జాజితైలం చేర్చి మర్దన చేస్తే ముఖం మీద వుండే మచ్చలు, నల్లని ఛాయలు తగ్గుముఖం పడతాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more