Digestive Biscuits Not Good for Health | డైజెస్టివ్ బిస్కట్లు.. అరుగుతాయని తింటే ఇక అంతే

Digestive biscuits danger to health

Digestive Biscuits, Dangerous, Health, Digestive Biscuits Study, Digestive Biscuits Not Good for Health

Digestive Biscuits Danger to Health. Scientists observed It Contains Dangerous Contains so better to avoid those biscuits.

డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

Posted: 03/14/2018 03:52 PM IST
Digestive biscuits danger to health

మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్ బిస్కట్ల (తేలికగా జీర్ణమయ్యే బిస్కట్లు) గురించి వినే ఉంటారు. తింటూ కూడా ఉంటారు.

జీర్ణశక్తి సరిగా లేని రోగుల కోసం ఈ బిస్కట్లు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుత 21వ శతాబ్దంలో ఇవి ఆరోగ్యకరమైన చిరుతిండిగా మారిపోయాయి. కానీ, వచ్చిన చిక్కంతా ఏంటంటే, ఈ డైజస్టివ్ బిస్కట్లలో ఉన్న చక్కెరలు, కొవ్వు పదార్థాలు, సోడియం, శుద్ధి చేయబడిన పిండిని కూడా మనం తినేస్తున్నాం. అందువల్ల ఇవి ఎంతమాత్రం ఆరోగ్యకరం కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డైజస్టివ్ బిస్కట్లు మన ఆకలిని తీర్చవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నామన్న తృప్తినీ ఇవి మనకు కల్గించవచ్చు. కానీ, వీటిని అత్యధికంగా ప్రాసెస్ చేయడం వల్ల ఇవి మనకు మంచివి కావని వారు చెబుతున్నారు. ఇందుకు మూడు ముఖ్య కారణాలను కూడా వారు విశ్లేషించారు.

మొదటి కారణం...
వీటిలో శుద్ధి చేయబడిన పిండి, చక్కెర, కొవ్వు పదార్థాలు, సోడియం ఉంటాయి. వీటిలో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయంటూ సదరు ప్యాకెట్స్ పై రాసి ఉంటుంది. కానీ, అక్కడ రాసిన గ్రీకు పదాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ బిస్కట్లకు బానిసలయ్యేలా వీటిలో రుచిని ఎక్కువగా కల్గించే పదార్థాలను కలిపి ఉన్న విషయం అర్థమవుతుంది.

రెండోది..
ఈ బిస్కట్లు వందలాది పరిమాణాల్లో మనకు లభిస్తుంటాయి. అందువల్ల కంపెనీలు వీటిని ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంటాయి. మీరెప్పుడైనా బిస్కట్లు బూజు పట్టి చెడిపోవడం లాంటివి గమనించారా? లేదు కదా..అందుకు కారణం...ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా ప్రాసెస్ చేయడం, ఇందుకు అవసరమైన కొన్ని పదార్థాలను కలపడం చేస్తుంటారు.

ఇక మూడో కారణం...
బిస్కట్లలోని అనారోగ్యకర కేలరీలు. సాధారణంగా డైజస్టివ్ బిస్కట్ కనీసం 50 కేలరీలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైనవి కావు. ఇవి నాజూకుతనం కోసం మనం చేసే ప్రయత్నాలను దెబ్బతీయవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో మనకు అర్థంకాకపోవచ్చు కూడా. చక్కెరలు, పిండి, సోడియంలలో ఉండే అనారోగ్యకర కేలరీలు మన శరీరానికి అవసరం లేదు. ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశాలే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more

  • Smart phone lock tips

    స్మార్ట్ ఫోన్ కి సెక్యూరిటీ పెట్టాల్సిందే!

    Oct 11 | స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో కనిపించేందే. తక్కువ ధరలో అడ్వాన్స్ అప్లికేషన్లతో లోకల్ బ్రాండ్లు కూడా ఫోన్లు మార్కెట్ లోకి దించేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోనూ దాదాపుగా 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్... Read more