ప్రస్తుత ఆధునిక యుగంలో ఉద్యోగస్తులు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఎక్కువసేపు ఆఫీసు పనుల్లో నిమగ్నమై వుండటం, పోషకాహారం సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తొలుత ఈ సమస్య అంతగా బాధించకపోయినా.. కాలక్రమంలో ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కళ్లు మంటగా అనిపించడం, ఒళ్లు నొప్పులు తీవ్రం కావడం, గుండె సంబంధిత వ్యాధులు, ఇంకా ఇతర సమస్యలు చుట్టుముడుతాయి. కాబట్టి.. ఎంత వీలైతే అంత త్వరగా ఈ నిద్రలేమి నుంచి ఉపశమనం పొందాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల.. ఉదయం నుంచి అనుభవించిన మానసిక ఆవేదనలు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, ఇతరత్ర ఇబ్బందులు దూరమవుతాయి. లావెండర్, వెనిల్లా, పరిమళాలతో కూడిన స్నానం ఆచరిస్తే.. ఎంతో ప్రశాంతంగా వుంటుంది. అప్పుడు బెడ్ పై హాయిగా సేద తీర్చుకోవచ్చు. బెడ్ రూమ్ లో తక్కువ వెలుతురుతో వుండేలా చూసుకోవాలి. గది చీకటిగా వుంటే.. నిద్రలో అంతే త్వరగా జారిపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమందికి టీ తాగితే మనస్సు ఆహ్లాదంగా వున్నట్లు అనిపిస్తుంది. అటువంటి వారు.. నిద్రపోవడానికి గంటముందు మనస్సును సేదతీర్చే టీ త్రాగితే చాలా మంచిది. అయితే.. పడుకోవడానికి ముందు వ్యాయామాలు మాత్రం చేయకూడదని హెచ్చరిస్తున్నారు.
ఇక ఆహారం విషయానికొస్తే.. ఎముకల పటిష్టతకు దోహదం చేసే పాలపదార్థాలు, కాల్షియం బాగా ఉన్న ఆరెంజ్ జ్యూస్లు, చేపలు, ఆకుకూరలు, నువ్వులు, బాదాములు, చిక్కుళ్లు వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని నిపుణలు చెబుతున్నారు. ఆ ఆహారాలు నిత్యం తీసుకుంటే.. వాటి ద్వారా శరీరానికి కావలసిన క్యాల్షియం, విటమిన్ డిని పొందవచ్చును. అవి.. నిద్రలో త్వరగా జారిపోవడానికి ప్రేరేపిస్తాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more