సహజంగా ప్రతిఒక్కరు తమ ఇళ్లల్లో ఒక ప్రత్యేక గది (పడక గది)ని నిర్మించుకుంటారు. వాస్తుప్రకారం ఇల్లు నిర్మాణం బాగున్నప్పటికీ, తరుచుగా ఆచరించాల్సిన నియమాలు, సంప్రదాయాలను ప్రతిఒక్కరు మర్చిపోతుంటారు. ఇల్లు అలంకరణ బాగానే వున్నప్పటికీ.. లోపలున్న పడక గది గురించి అంతగా పట్టించుకోరు. వాస్తుప్రకారం పడక గదిలో కూడా కొన్ని ఆచారాలను పాటించాల్సి వస్తుంది. తద్వారా దంపతుల మధ్య ఎటువంటి విభేదాలు వుండక.. సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. లేకపోతే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
వాస్తుప్రకారం పడకగదిలో పాటించాల్సిన ఆచారాలు, నియమాలు :
1. ముందుగా పడకగదిని వాస్తుప్రకారం అనువైన దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. నిత్యం సానుకూల శక్తి ప్రవహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతారు.
2. ముఖ్యంగా మీరు మీ పడకగదిలో అద్దాన్ని వుంచుకోకపోవడం చాలా మంచిది. ఒకవేళ అద్దం వుంటే.. అది పడకగదిని నలువైపులా ప్రతిబింబించేలా చేస్తుంది. దాంతో ప్రతికూల వాతావరణం పెరిగి.. దాంపత్య జీవితానికి అనుకోని సంఘటనలను తెచ్చిపెడుతుంది. కాలం చేయిదాటిపోతే.. వైవాహిక విచ్ఛిన్నానికి కూడా దారితీసే అవకాశం వుంది.
3. పడక గదిలో ఏర్పాటు చేసుకున్న మంచాన్ని తలుపులకు ఎదురుగాగానీ, కిటికీ కిందగానీ వుండకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మూడువైపులానుంచి దిగడానికి వీలుగా వుండేవిధంగా మంచాన్ని అమర్చుకోవాలి.
4. ఒకవేళ పడకగదిలో బాత్ రూమ్ వుంటే ఎల్లప్పుడూ దాని తలుపులు మూసేసి వుండాలి. బాత్ రూమ్ అటాచ్డ్ లేకపోతే మరీ మంచిది. ఒకవేళ బాత్ రూమ్ వుండి, దాని తలుపులు తెరిచివుంటే.. శారీరకంగా ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా, దంపతుల మధ్య నిత్యం తగాదాలు ఏర్పడే ఆస్కారం వుంది.
5. పడకగదిలో మొక్కలనుకాని, ఫిష్ అక్వేరియంలాంటివి కాని పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే.. ఎదిగే మొక్కలు, చురుకుగా తిరిగే చేపలు.. బెడ్ రూంలో వుండే విశ్రాంతిని దూరం చేస్తాయి. ఫలితంగా నిత్యం అశాంతి వాతావరణం ఆ గదిలో అలుముకుంటుంది.
6. మంచం కింద ఏ వస్తువు లేకుండా వుండేలా చూసుకోవాలి. ఒకవేళ వుంటే వాటిని వెంటనే తీయిస్తే మంచిది. ఎందుకంటే.. సానుకూల శక్తి నిత్యం గదిలో ప్రవేశించాలంటే ఆ ప్రదేశం మొత్తం పరిశుభ్రంగా వుండాలి. అప్పుడే దాంపత్య జీవితానికి ఎటువంటి అడ్డంకులు, సమస్యలు వుండవు.
7. వ్యాయామం చేసే పరికరాలు, కంప్యూటర్ వంటి సాధనాలను పడగ గది నుంచి వేరే చోటుకు తరలించుకుంటే మంచిది. ఒకవేళ అవి వుంటే.. దాంపత్య సంబంధాలు కూడా ఏదో పనికి సంబంధించిన లాగే అనిపిస్తాయి. ఇద్దరి మధ్య సఖ్యతను కోల్పోతారు. అలాగే సూది మొనలు కగిలిన ఫర్నీచర్స్ కాకుండా గుండ్రటి అంచులు కలిగిన ఫర్నీచర్స్ వాడటం శ్రేయస్కరం.
8. పడక గదిలో వున్న కిటికీ పక్కన పింక్ లేదా హృదయాకారంలో వుండే క్రిస్టల్స్ ను తగిలించుకుంటే చాలా మంచిది. తద్వారా ఇది దంపతుల మధ్య ప్రేమకు సంబంధించిన అనుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more