Director reveals Samantha's character in Sivakarthikeyan film

Samantha to romance sivakarthikeyan

Samantha, sivakarthikeyan, samantha sivakarthikeyan film, samantha next film, sivakarthikeyan next film, Ponram, samantha romances with sivakarthikeyan, kollywood

Samantha has been signed to play the female lead in Sivakarthikeyan's next movie, which will be directed by Ponram.

పెళ్లికి ముందే శివకార్తికేయన్ తో సమంత రొమాన్స్

Posted: 08/21/2016 04:09 PM IST
Samantha to romance sivakarthikeyan

చెన్నై చంద్రంగా పేరు తెచ్చుకుని ఇటు టాలీవుడ్ లోనూ అగ్ర హీరోలందరితో నటించి.. ప్రముఖ నటి సమంత ఇటీవల అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. అక్కినేని నటవారసుడితో ప్రేమలో పడిన ఈ చిన్నది త్వరలోనే నాగచైతన్యను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వెల్లడించింది, అంతేకాదు వివాహం అనంతరం చిత్రాలలో నటిస్తుందో లేదోనన్న సందేహం తన అభిమానులకు తేరుకోలేని షాక్ గురవుతున్నారు, ఈ అనుమానాలు బలపడేందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ మ్యారేజ్ న్యూస్ చెప్పినప్పటి నుంచి సమంత కొత్తగా చిత్రాలను అంగీకరించలేదు, ఇదే అభిమానులతో పాటు చలనచిత్ర రంగంలోనూ రేకెత్తుతున్న అనుమానాలను బలపరుస్తుంది,
 
అయితే తాజాగా సమంత అభిమానులకు శుభవార్త ఏమిటంటే తను మళ్లీ కొత్త చిత్రాలను అంగీకరిస్తున్నారు. తమిళంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా వార్త. ఇంతకు ముందు శివకార్తికేయన్‌తో వరుత్తపడాద వాలిభర్ సంఘం, రజనీమురుగన్ చిత్రాలను తెరకెక్కించిన పొన్‌రామ్ తాజాగా దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ శివకార్తికేయన్ హీరోగా నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా సమంతను నాయకిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా రెమో చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్‌డీ.రాజా అదే హీరోతో మోహన్‌రాజా దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు.
 
ఇందులో నయనతార నాయకిగా నటించనున్నారు. ఇదే నిర్మాత మళ్లీ శివకార్తికేయన్‌తో మూడో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలోనే సమంత హీరోయిన్‌గా నటించాడానికి ఓకే అన్నారట. ఈ చిత్రాన్ని 2017 ప్రథమార్థంలో ప్రారంభించి దీపావళికి విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి నిర్మాత ఆర్‌డీ.రాజా తన ట్విట్టర్‌లో పేర్కొంటూ వెల్‌కమ్ టూ సమంత అని పోస్ట్ చేశారు. ఇక మరికొందరు దర్శక నిర్మాతలు సమంత ముందు క్యూ కట్టే అవకాశం లేకపోలేదంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Sivakarthikeyan  RD Raja  Twitter  kollywood  

Other Articles