Chiru 150: Chiranjeevi's comeback film titled Khaidi No 150

Chiranjeevi s comeback film gets an official title

chiru 150, chiranjeevi, chiru 150 title, chiranjeevi 150 title, khaidi no 150, chiru 150 first look, chiru 150 first look poster, chiranjeevi first look, chiru 150 title, chiru 150 poster, prabhudheva chiranjeevi, chiru 150 release

megastar Chiranjeevi, who is presently shooting for his forthcoming Telugu film, which is the official remake of of Ilayathalapathy Vijay's blockbuster Tamil film Kaththi, finally gets official title.

మెగాస్టార్ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. అభిమానులకు చిరు గిఫ్ట్

Posted: 08/21/2016 07:03 PM IST
Chiranjeevi s comeback film gets an official title

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. తన తనయుడు, హీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా మారి రూపోందిస్తున్న ఈ చిత్రానికి ఏ టైటిల్ పెట్టాలా..? అన్న విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు నిర్మాణ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొదట్లో కత్తిలాంటోడు టైటిల్ ను పరిశీలించిన చిత్రవర్గాలు.. ఆ తరువాత దానిని కాదని, వేరే టైటిల్ కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. అయితే వారి అభిలాష ఫలిచిందని తెలుస్తుంది.

కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవితో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తైన ఈ చిత్రానికి నూటికి నూరు శాతం సరిపడే టైటిల్ “ఖైదీ నెంబర్ 150’’ను ఖరారు చేసినట్లు రామ్ చరణ్ తెలిపారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు.

షూటింగ్ ఆన్ లొకేషన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ స్టయిల్ గురించి ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఇదివరకే ఓ అప్‌డేట్ అందించారు. మెగాస్టార్ షూటింగ్‌లో ఎంతో ఎనర్జిటిక్‌గా చేస్తున్నారంటూ రత్నవేలు కితాబిచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై ఫిలింనగర్‌లో చర్చ సాగుతోంది. దీంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megastar  chiranjeevi  150th movie  title  ram charan  tollywood  

Other Articles