experts giving suggestions to use some remedies for chapped lips | lip balm remedies | lips beauty tips

Beauty home remedies for chapped lips

lips beauty tips, lip balm, chapped lips beauty tips, beauty home remedies, lips beauty, chapped lips tips, remedies for lips

beauty home remedies for chapped lips : experts giving suggestions to use some remedies for chapped lips.

పగిలిన పెదాలకు బెస్ట్ రెమెడీస్

Posted: 11/19/2015 05:53 PM IST
Beauty home remedies for chapped lips

వాతావరణంలో వచ్చే మార్పులు సౌందర్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా.. మృదువుగా వుండే పెదవులు పగులుతాయి. సాధారణంగా శీతాకాలంలో ఈ రకమైన సమస్య రావడం సహజం. పెదాలు అలా పగిలిపోవడంతో అవి చర్మసౌందర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చాలా బాధిస్తాయి కూడా. ఈ సమస్య చిన్నగా వున్నప్పుడు జాగ్రత్త తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.

అలాకాకుండా నిర్లక్ష్యం చేస్తే.. చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి.. వీలైనంత త్వరగా ఈ పెదవుల పగుళ్ల సమస్యను చెక్ పెట్టాల్సి వుంటుంది. అందుకు రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రోడక్ట్స్ వినియోగించడం కంటే.. సహజ పదార్థాలతో తయారుచేసిన రెమెడీలే ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* పెదాల సంరక్షణకు కొబ్బరి నూనె చక్కగా పని చేస్తుంది. పెదవులు ఎండిపోయి పొరలుగా ఏర్పడుతుంటే పెదవులకు తగినంత తేమను అందించడం ముఖ్యం. కొబ్బరి నూనెలో ఉండే ఎన్నో మినరల్స్ పెదవులకు కావలసినంత తేమను అందించి పెదవులు మృదువుగా ఉండేందుకు తోడ్పడుతాయి. కాబట్టి.. పెదాలను పగిలినప్పుడు నిత్యం కొబ్బరినూనె రాస్తూ వుంటే.. ఆ సమస్యను అధిగమించవచ్చు.

* ఒక పాత్ర తీసుకుని అందులో ఒక్కొక్క టీస్పూన్ చొప్పున కొబ్బరి నూనెను, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై కాటన్ బాల్ తో అద్దండి. కోమలంగా వేళ్ళతో పెదవులపై సర్కులర్ మోషన్ లో ఒక నిమిషంపాటు మసాజ్ చేయండి. కొద్దిసేపు తర్వాత మెత్తటి వస్త్రంతో పెదవులను తుడుచుకోవాలి. అప్పుడు పెదాలు ఎంతో మృదువుగా తయారవుతాయి.

* ఒక గిన్నె తీసుకుని అందులో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె తీసుకుని.. అందులో ముప్పావువంతు టేబుల్ స్పూన్ హనీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక మూత ఉన్న జార్ లో భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకుని.. పెదాలకు రాసుకుంటూ వుండాలి. అలా చేస్తే మంచి ఫలితం వుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chapped lips tips  beauty tips for lips  winter beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more