The Biography Of Shankar Dayal Sharma Who Is 9th Prime Minister Of India | Indian Activists | Indian Freedom Fighter

Shankar dayal sharma biography indian 9th prime minister freedom fighter

Shankar Dayal Sharma biography, Shankar Dayal Sharma history, indian prime minister, Shankar Dayal Sharma life story, Shankar Dayal Sharma wikipedia, indian freedom fighters, indian activists

Shankar Dayal Sharma Biography Indian 9th Prime Minister Freedom Fighter : The Biography Of Shankar Dayal Sharma Who Is 9th Prime Minister Of India. He Is Also Indian Activist.

దేశానికి 9వ రాష్ట్రపతిగా వ్యవహరించిన శంకర్ దయాళ్

Posted: 08/21/2015 03:13 PM IST
Shankar dayal sharma biography indian 9th prime minister freedom fighter

భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కృషి చేసిన రాజకీయ నాయకుల్లో శంకర్ దయాళ్ శర్మ ఒకరు. దేశానికి 9వ రాష్ట్రపతిగా వ్యవహరించిన ఈయన.. బ్రిటీష్ పాలన నుంచి దేశాన్ని స్వాతంత్ర్యం కలిగించేందుకు పోరాడిన సమరయోధుల్లో కీలకపాత్ర పోషించారు. తన వాక్చాతుర్యంతో స్వాతంత్ర్యంపై ప్రజల్లో చైతన్యం నింపారు. అందరినీ ఉద్యమబాటలో నడిపించడంలో తనదైన శైలిలో ప్రణాళికలు రూపొందించారు. ఈయన గొప్ప పండితుడు కూడా! ఇక రాజకీయ రంగంలో ఈయన ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. ఓ సాధారణ స్థాయి నుంచి రాష్ట్రపతి హోదా వరకు అంచెలంచెలుగా ఎదిగారు.

జీవిత విశేషాలు :

1918 ఆగష్టు 19వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగరంలో జన్మించారు. శర్మ సెయింట్ జాన్ కళాశాల, ఆగ్రా కళాశాల, అలహాబాద్ విశ్వవిద్యాలయం, లక్నో విశ్వవిద్యాలయం, ఫిట్జ్ విలియం కళాశాల, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, లింకన్స్ ఇన్, హార్వర్డ్ న్యాయ పాఠశాల మొదలైన విద్యాసంస్థల్లో ఈయన విద్యాభ్యాసం కొనసాగింది. చదువుకునే రోజుల్లో ఈయన అన్ని విభాగాల్లో చురుకుగా పాల్గొనేవారు. చాలా తెలివైనవారు కూడా!

దేశప్రజలపై తెల్లదొరల ఆకృత్యాలను పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఆనాడు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల్లో శంకర్ దయాళ్ కూడా పాల్గొన్నారు. 1940వ దశకంలో శర్మ భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. అదే దశకంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి వరకూ అదే పార్టీకి విధేయులుగా ఉన్నారు. స్వాతంత్ర్యానంతరం 1952లో అప్పటి భోపాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో భోపాల్ మిగతా చిన్న రాష్ట్రాలతో కలిసి మధ్యప్రదేశ్ ఏర్పడేవరకూ ముఖ్యమంత్రిగా పని చేశాడు. 1960లలో ఇందిరా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడాన్ని సమర్థించారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక మంత్రి పదవులు నిర్వహించారు.

1974-77 మధ్యలో కమ్యూనికేషన్ల శాఖా మంత్రిగా పని చేశారు. 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగానూ, 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నపుడు, ఉపరాష్ట్రపతిగానూ వ్యవహరించారు. అంతకుముందు 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ, న్యాయ శాఖ మొదలైన అనేక శాఖల్లో కేంద్రమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు. 1972-74 మధ్యలో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పనిచేశారు. తన చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. 1999  అక్టోబర్ 9న గుండెపోటుతో ఢిల్లోని ఒక వైద్యశాలలో అడ్మిట్ అయ్యారు. కొద్ది సేపటికే తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shankar Dayal Sharma  indian activists  indian freedom fighters  

Other Articles