Netaji and azad hind fouz స్వతంత్ర భారత సేనాని సుబాష్ చంద్రబోస్..

Prominent freedom fighter subash chandrabose biography

Subhash Chandra Bose, netaji, Subhash Chandra Bose biography, Subhash Chandra Bose freedom fight, Subhash Chandra Bose indian national congress, Subhash Chandra Bose azad hind fouz, Subhash Chandra Bose mahatma gandhi, Subhash Chandra Bose japan temple, Subhash Chandra Bose pictures, Subhash Chandra Bose images, Subhash Chandra Bose photos, Subhash Chandra Bose netaji, indian freedom fight

Subhash Chandra Bose is one of the Indian freedom fighters and the cause of Indian freedom. He was known as Netaji.

అజాద్ హింద్ ఫౌజ్ జవజీవాలను తెచ్చిన నేతాజీ..

Posted: 01/23/2018 04:48 PM IST
Prominent freedom fighter subash chandrabose biography

భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన విప్లవ నేత. అహింసా మార్గంతో విభేధించిన ఆయన రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా.. రాజీనామా చేశాడు.  ఓ వైపు దేశం మొత్తం శాంతియుత ఉద్యమంతో.. అహింసామార్గంలో పయనిస్తున్నా.. ఈ తరహా ఉద్యమాలతో పనులు జరవని తెగేసి చెప్పిన ధీరుడు.. తన బాటలో దేశవ్యాప్తంగా వేలాది మందిని పయనింపజేసి.. అజాద్ హింద్ ఫౌజ్ సంస్థకు నూతన జవజీవాలను తీసుకువచ్చిన మహానేత. అయనే సుబాష్ చంద్రబోస్.

అహింసను తప్పుబట్టనని చెప్పిన ఆయన ఓ వర్గం అలా చేస్తూన్న క్రమంలోనే మరో వర్గమాత్రం ఎదురుతిరగి అంగ్లేయులకు తిరుగుబాటు రుచిచూపించాలని పిలుపునిచ్చాడు. కేవలం అహింసా మార్గంలోనే పనులు జరుగుతాయని వెళ్లితే.. అందుకు ఫలితం రావాలంటే ఏళ్ల సమయం వేచి చూడాలని అన్నారు. పోరుబాటే తన రూటన్నాడు సుభాష్ చంద్రబోస్. సాయుధ పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన ధీరుడు బోస్. స్వాతంత్ర్యం ఒకరు మనకిచ్చేదేమిటి.. మనమే తీసుకోవాలని.. అంగ్లేయులను తరమికోట్టాలని పిలుపునిచ్చిన వీరుడు బోస్.

1897, జనవరి 23. ఒడిశాలోని కటక్ సిటీలో ఓ సంపన్నకుటుంబంలో పుట్టాడు చంద్రబోస్. తండ్రి జానకీనాథ్ బోస్…గొప్ప లాయర్. జాతీయవాది కూడా. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు కూడా ఎన్నికయ్యారాయన. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడిచిన బోస్… చదువులోనే కాదు, దేశ భక్తిలో కూడా ఓ అడుగుముందుండే వాడు. పుట్టుకతోనే ధనవంతుడు కావడంతో… ఉన్నత చదువులు చదివాడు. 1920లో రాసిన భారతీయ సివిల్ సర్వీసు పరీక్షల్లో ఫోర్త్ ర్యాంక్ కొట్టాడు బోస్. జాబ్ వచ్చింది.. 1921లో జాబ్ కు రిజైన్ చేసి… స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించాడు. రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

దేశానికి ఇండిపెండెన్స్ రావాలంటే.. గాంధీజీ అహింసావాదం మాత్రమే సరిపోదు… పోరుబాట కూడా ముఖ్యమని భావించాడు చంద్రబోస్. 1938లో గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా…. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పట్టాభి సీతారామయ్య ఓటమిని తన ఓటమిగా గాంధీ భావించాడని ఓ వాదన. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పొలిటికల్ పార్టీని స్థాపించాడు. 1939లో సెకండ్ వాల్డ్ వార్ వచ్చింది. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు.. ఇదే కరెక్ట్ టైమని భావించిన బోస్… కూటమి ఏర్పాటు కోసం రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించారు. జపాన్ సహకారంతో ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఏర్పాటు చేశాడు చంద్రబోస్. హిట్లర్ ను కూడా కలిశారు.

సెకండ్ వాల్డ్ వార్ తర్వాత… బ్రిటీష్ వాళ్లు దేశానికి వదిలి వెళ్తారని గాంధీ, నెహ్రూ లాంటి నాయకులు భావించారు. చంద్రబోస్ మాత్రం… ఈ యుద్ధంలో ఆంగ్లేయులను అంతంచేయాలని చూశాడు.  కానీ.. బ్రిటీష్ సర్కార్ ఏకపక్షంగా, కాంగ్రెస్ ను సంప్రదించకుండానే ఇండియా తరఫున యుద్ధాన్ని ప్రకటించాయి. దీంతో నిరసనకు దిగిన బోస్.. అండ్ టీమ్ ను జైల్లో పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. ఏడు రోజుల నిరాహార దీక్ష తర్వాత.. బయటికొచ్చిన బోస్ ను హౌజ్ అరెస్ట్ చేశారు. మారువేషంలో మేనల్లుడి సహాయంతో దొంగ పాస్ పోర్ట్ తో పెషావర్ చేరుకున్నాడు. అట్నుంచి జర్మనీ చేరుకుని అక్కడ ఆజాద్ హింద్ రేడియోను స్థాపించి.. ప్రసారాలు మొదలుపెట్టాడు. 42 వరకు జర్మనీలో ఉన్న బోస్… 1943లో భారత సైన్యంలోకి వచ్చాడు. 1944 జులై 4న బర్మాలో జరిగిన ర్యాలీలో బోస్ ఇచ్చిన స్పీచ్ దేశ యువతను ఉత్తేజపరిచింది. మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెడతాను అన్నాడు సుబాష్ చంద్రబోస్.

పుట్టుక గురించే తప్ప బోస్ మరణం ఇప్పటికీ  మిస్టరీనే. 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యో ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని కథనం. దీనిపైనా భిన్న వాదనలున్నాయి. అసలు ఆ రోజు ఎలాంటి విమాన ప్రమాదమూ జరగలేదని.. ఆయన గుమ్నానీ బాబాగా చాలా ఏళ్ల పాటు బతికే ఉన్నారని మరో ప్రచారం కూడా ఉంది. గతేడాది బోస్ పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వంద సీక్రెట్ ఫైళ్లను బయటపెట్టినా… వాటిలో కూడా బోస్ మరణంపై ఎలాంటి క్లారిటీ లేదు. తర్వాత కూడా బోస్ సీక్రెట్ ఫైళ్లు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్నాయి. అంతకు కొన్ని నెలల ముందే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా కొన్ని ఫైళ్లను డీ క్లాసిఫై చేసింది. అయినా.. ఇప్పటి వరకు బోస్ మరణంపై అనుమానాలు పోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subhash Chandra Bose  Indian freedom fight  azad hind fauz  Netaji  freedom fighters  

Other Articles